Karthika Deepam : అందరినీ అనుమానించే స్టేజ్‌లో డాక్టర్ బాబు.. అమ్మకు సాయంగా వంటలక్క కూతుర్లు

ట్విస్ట్ లమీద ట్విస్ట్ లతో ఎంతో రసవత్తరంగా సాగుతూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్లో ఈ రోజు ఎం జరుగుతుందో చూద్దాం..!

Karthika Deepam :  అందరినీ అనుమానించే స్టేజ్‌లో డాక్టర్ బాబు.. అమ్మకు సాయంగా వంటలక్క కూతుర్లు
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 13, 2021 | 11:20 AM

Karthika Deepam : సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7. 30 అయ్యిందంటే చాలు టీవిలముందుకు చేరుకుంటారు. అంతగా ఆకట్టుకుంటుంది కార్తీక దీపం. మార్చి 12 న 984 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ట్విస్ట్ లమీద ట్విస్ట్ లతో ఎంతో రసవత్తరంగా సాగుతూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్లో ఈ రోజు ఎం జరుగుతుందో చూద్దాం..!

దీప తండ్రి మురళీ కృష్ణ కూతురు అల్లుడుల ఫోటో చూస్తూ.. బాధపడుతుంటే.. కార్తీక్ ఎంటర్ అయ్యి.. ఆ ఫోటోని తీసుకుని కింద పడేస్తాడు.. దీంతో మురళీ కృష్ణ ఆవేశంతో డాక్టర్ బాబు.. ఏమిటీ దౌర్జన్యం ఆడపిల్ల తండ్రికాదా.. ఎన్ని అన్నా ఎల్లకాలం పడిఉంటాడు అని అనుకోకండి అంటూ గట్టిగా మాట్లాడతాడు.. కొంచెం సంస్కరం నేర్చుకోండి అని అంటాడు. కార్తీక్ ఏమిటి నేను సంస్కారం నేర్చుకోవాలా.. అదీ మీ ఎదగ్గర నుంచి.. ఇద్దరి కూతుర్లను కానీ మా ఇంటికి కానీ ఖర్చులేకుండా పంపించారు. సంస్కారం మేము నేర్చుకునే స్టేజ్ లో లేము.. నా గురించి నిజం మీకు చెప్పను.. ఆ నిజం నీ కూతురుకు చెప్పకుండా పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు.. కూతురు రోడ్డు మీద పడితే కనీసం ఆదరించే మనసులేదు కానీ సంస్కారం గురించి నాకు చెప్పకండి. నా కూతురిని గుండెల మీద పెట్టి పెంచుకున్నా.. దానిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి.. నాకు తెలియకుండా దాచిపెట్టింది. అంటూ అంటుంటే.. మురళీ కృష్ణ ఎక్కడ నుంచి వచ్చింది నీ కూతురు నీ భార్యకు కన్నారు కూతుర్ని అని ప్రశ్నిస్తాడు.. నా కూతురు నవమాసాలు మోసి కంటే వచ్చింది నీ కూతురు.. అంత ప్రేమ ఉన్నవాడివి.. ఎందుకు ఆపలేకపోయావు అని అంటాడు.

అయినా ఎన్నాళ్ళు పడుతుంది మీ మాటలను నా కూతురు.. దానికీ మనసుంది.. అది ఈరోజు విరిగిపోయింది సహనం నశించి ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. దిక్కులేని వాళ్ళలాగా ఎక్కడికి వెళ్లిపోయారో ఎలా బతుకుతున్నారో అంటూ కన్నీరు పెడతాడు.. ఏ ఆడదైనా ఎన్నాళ్ళు భరిస్తుంది అందుకనే మీరు ఇక మారారని.. ఆ ఆశలేదని విరక్తితో వెళ్ళిపోయింది. మీ చదువుని సంస్కారాన్ని బ్రష్టుపట్టించకండి అని అంటాడు వెంటనే కార్తీక్ నీ కూతురు కదా మా వంశాన్ని బ్రష్టుపట్టించి .. మా కుటుంబ గౌరవాన్ని కాలదన్ని పోయింది.. ముందు నా కూతురు ఎక్కడ ఉందొ చెప్పు అని నిలదీస్తాడు మురళీ కృష్ణను. ఇంతలో భాగ్య కలుగ జేసుకుని నిజంగా దీప ఎక్కడ ఉందొ మాకు తెలియదు.. చెప్పకుండానే వెళ్ళిపోయింది అని చెబుతుంది. అప్పుడు కార్తీక్ ప్రపంచం లో ఎక్కడ నా కూతురు ఉన్నా తీసుకుని తెచ్చుకుంటా అని అక్కడ నుంచి ఇంటికి వస్తాడు.

అదే సమయంలో ఇంట్లో సౌందర్య, ఆనందరావు లు బయటకు బాలుదేరతారు. ఎక్కడికి అని అడుగుతాడు కార్తీక్.. శంకరమఠంలో ఈరోజు శివరాత్రి జాగారం అందుకనే వెళ్తున్నాం అని సౌందర్య చెబుతుంది. అప్పుడు కార్తీక్ అనుమానంగా నిజంగా శంకరమఠానికేనా నాకు ఆలా చెబుతున్నారా అని ప్రశ్నిస్తాడు.. అప్పుడు ఆనందరావు పెద్దోడా రాను రాను నీకు నమ్మకం పోతుంది.. చివరికి నీ నీడను కూడా నువ్వు నమ్మలేని స్టేజ్ కు చేరుకుంటావు అని అంటాడు. అపుడు ఆరోగ్యం బాలేని మనిషిని జాగారం అని తీసుకునేళ్ళడం ఏమిటి.. హిమనీ అడిగానని చెప్పండి అని సౌందర్యంతో అంటుంటే.. నిజంగా నాకు తెలియదు.. తెలిసినా మీ నాన్నగారు దీపని మానవరాళ్లను ఇంటికి తీసుకుని రావడానికి రెడీగా ఉన్నారు అంటూ చెప్పి.. రండి అని ఆనందరావుతో బయటకు వెళ్తుంది.

ఇంతలో దీప బట్టలు మడతపెడుతూ.. కార్తీక్ అన్నమాటలను గుర్తు చేసుకుని అసహనానికి గురవుతుంది. శౌర్య వచ్చి తల్లితో మాట్లాడబోతుంటే.. దీప కోపంగా అరుస్తుంది. తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకుని మీరు పెద్ద చదువులు చదవాలంటే నేను కష్టపడాలి తప్పదు అని అంటుంది. మేము ఇక చదవం. నీకు సాయంగా ఉంటామని శౌర్య చెబితే.. మీ అమ్మ తన కూతుర్లను చదివించుకోలేదు అని అనుకుంటున్నారా.. అని శౌర్యాని వరిస్తుంది.. అప్పుడు శౌర్య అమ్మ నేను ఒక్కటి అడగనా అంటే.. అడుగు చెప్పేది ఐతే చెబుతా అంటుంది.. మాకు నాన్న గుర్తుకొచ్చినట్లు నీకు గుర్తుకురావడం లేదా అని అంటుంది. దీంతో దీప త్వరగా నిద్రపోండి. రేపు పొద్దున్నే లేచి తలకు స్నానం చేయాలి అంటే ఎందుకమ్మా అని అడుగుతుంది శౌర్య.. రేపటి నుంచి నాన్నా టిఫిన్ సెంటర్ మొదలు పెడతాం కదా అందుకు త్వరగా నిద్రపోండి.. అయినా హిమ ఎక్కడ అని అడుగుతుంది దీప..

ఇంతలో ఆదిత్య, శ్రావ్యల మధ్య హిమ కూర్చుని ఉంటుంది. అమ్మకి చెబితే రానివ్వదని నేనే చెప్పకుండా వచ్చేసా.. డాడీని చూడకుండా ఉండలేకపోయా.. నాకు నాన్నే కావాలి అంటుంది ఇంతలో మీద మెట్లమీద నుంచి దిగుతున్న కార్తీక్ హిమ ని చూసి గబగబా వచ్చి హత్తుకుంటాడు. హిమా హిమా అంటుంటే.. ఆదిత్య, శ్రావ్య షాక్ తో చూస్తారు.. ఆదిత్య ఏమిటి అన్నయ్య హిమ ఇప్పుడొచ్చింది అని ప్రశ్నించేసరికి అక్కడ హిమ ఉండదు.. తాను హిమ వచ్చినట్లు కలగన్నానని అప్పుడు తెలుసుకుంటాడు. మోనిత ట్రాప్ పూర్తిగా పడిన కార్తీక్ ఇంతమంది ఒకటే చెబుతున్నారు అది నిజమేమో అనే విధంగా ఆలోచించడం మానేసి.. దీపాన్ని దోషిగా చూస్తున్నాడు.. ఇప్పటికే మోనితను పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో చూడాలి మరి.

Also Read:

ఈ శివాలయంలో అన్ని సైన్స్ కు అందని మిస్టరీలే.. ఓ వైపుకు కదులుతూ.. రోజుకు 3 రంగులు మార్చే శివలింగం

తెలంగాణలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!