AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East godavari Farmers : ప్రమాదకర పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలు, పంటలకు నీటి కోసం ఆందోళన బాటపట్టాల్సిన దుస్థితి

East godavari Farmers agitation for water : పచ్చని చేలు, పాటిపంటలతో తులతూగే ప్రాంతాలుగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోయే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ..

East godavari Farmers : ప్రమాదకర పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలు, పంటలకు నీటి కోసం ఆందోళన బాటపట్టాల్సిన దుస్థితి
East Godavari Farmers Agita
Venkata Narayana
|

Updated on: Mar 12, 2021 | 12:13 PM

Share

East godavari Farmers agitation for water : పచ్చని చేలు, పాటిపంటలతో తులతూగే ప్రాంతాలుగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోయే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు నీటి చుక్కలు కరువయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు పెదగరువులో పంట పొలాలకు నీరు అందివాలంటూ అన్నదాతలు ఆందోళన షురూ చేయడం పరిస్థితికి అద్ధం పడుతోంది. మూకుమ్మడిగా పంట చేలల్లోకి దిగి పంట పొలాలకు నీరు ఇవ్వలని నిరసన చేపట్టారు రైతన్నలు.

నీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతామనటూ రైతులు ఇరిగేషన్ అసిస్టెంటు నాగప్రసాద్ పై మండిపడ్డారు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని, ఇరిగేషన్ అధికారుల అలసత్వం, రైతన్నలపై నిర్లక్ష్యంతో పంటలకు నీళ్లు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేల బీటలు వారిపోతున్న ప్రమాదకర వాతావరణం తమ ప్రాంతంలో నెలకొందని అంబాజీపేట మండలం రైతన్నలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చేలకు నీరందించాలని వేడుకుంటున్నారు.

Farmers Agitation

Read also : Pawan Kalyan Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమళ్లు మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్