AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమళ్లు మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా..

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమళ్లు మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
Venkata Narayana
| Edited By: Team Veegam|

Updated on: Mar 11, 2021 | 6:47 PM

Share

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మహాశివరాత్రి పర్వదినం రోజు పురస్కరించుకుని రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ ఏంటంటే.. ‘హరిహర వీరమళ్లు’. కాగా, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఒకే టైంలో రెండు సినిమాలకు పని చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ లైన్లో ఉండగానే ఇప్పుడు ‘హరిహర వీరమళ్లు’ ఫస్ట్ లుక్ రెడీ అయిపోయింది. అంతేకాదు, ఇప్పటికే పవన్ పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లు ఓకే చేసి ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. అలా ఇప్పుడు తనవి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన మూవీని విలక్షణ దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసిన పీరియాడిక్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి అందిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత  ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాణం భారీ బడ్జెట్ తో నిర్మాణం చేస్తున్నారు .

Read also : లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు

తొలి టీ20: సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశే.. ఓపెనర్‌గా రాహుల్.. తుది జట్టులో కీలక మార్పులు!

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం