Mahashivaratri 2021: శివుని ఫోటోలు పంపించి కాదు.. పదిమందికి సాయం చేసి శివరాత్రి జరుపుకోమంటున్న సోనూ సూద్
శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ప్రముఖ నటుడు సోనూ సూద్ డిఫరెంట్ గా ప్రజలకు, తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. శివరాత్రికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సన్నిహితులకు శుభాకాంక్షలను ఫొటోలు...
Mahashivaratri 2021: శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ప్రముఖ నటుడు సోనూ సూద్ డిఫరెంట్ గా ప్రజలకు, తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. శివరాత్రికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సన్నిహితులకు శుభాకాంక్షలను ఫొటోలు పంపించి గ్రీటింగ్స్ చెప్పడం కంటే.. ఎవరైనా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ఉంటె వారికి మీకు చేతనైనంత రీతిలో సాయం అందించని ప్రతి ఒక్కరినీ కోరారు. తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా మహాశివరాత్రి సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఈ సారి శివరాత్రి డిఫరెంట్ గా జరుపుకోమని పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ అని ఆయన ట్వీట్ చేశారు.
గత సంవత్సరం భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టించిన సమయంలో వేలాది మంది ఆపన్నులకు సోనూ సూద్ అండగా నిలబడ్డారు. ప్రజలు తమ ఇంటికి చేరుకోవడానికి సహాయం చేశారు. అప్పటి నుంచి మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. విద్య, వైద్యం, ఎవరు సాయం కావాలి అడిగినా వెంటనే తాను ఉన్నానంటూ ముందుకొస్తుంన్నారు సోను సూద్.
అయితే ఇటీవల సోను సూద్ సాయం పై కొంతమంది తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను ఎవరికీ జవాబుదారీ కాదని.. ఒక్క సామాన్య ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని చెప్పారు. తన ఉద్దేశాలను అనుమానించే వ్యక్తులకు సమాధానం చెప్పాలని అనుకోవడం లేదని.. తాను నడిచే దారి నుంచి దృష్టి మరల్చానని చెప్పారు . కొంతమందికి ఎదుటివారు ఏమి చేసినా తప్పులు ఎంచే గుణం ఉంటుంది.. అది వారి తప్పుకాదు ఏపనినైనా వ్యతిరేకించడం వారి DNA లో ఉందని చెప్పారు సోనూ.
शिव भगवान की फोटो फॉरवर्ड करके नहीं किसी की मदद करके महाशिवरात्रि मनाएं। ओम नमः शिवाय ।
— sonu sood (@SonuSood) March 11, 2021
ఇక సోనూ తో పాటు మరికొంతమంది బాలీవుడ్అ నటీనటులు శివరాత్రి శుభాకాంక్షలను చెప్పారు. అజయ్ దేవ్‌గన్, కంగనా రనౌత్ శివరాత్రి సందర్భంగా తమ అభిమానులతో సందేశాలను పంచుకున్నారు. మహాశివరాత్రి కి హార్దిక్ శుభాకాంక్షాలను కంగనా తెలుపగా.. అజయ్ దేవగన్ తన శివాయ్ చిత్రం నుంచి ఓ ఫోటో తో శుభాకాంక్షలు చెప్పాడు. అజయ్ దేవగన్ భార్య కాజోల్ కూడా ప్రతి ఒక్కరు శివుడు అనుగ్రహం పొందాలని కోరారు. సంజయ్ డాట్ శివుడి ఆశీర్వాదం ఎల్లపుడూ ప్రజలపై ఉండలని శుభాకాంక్షలు చెప్పారు.
Also Read: