Karthikeya: కార్తికేయను వదిలి పెట్టని ప్రముఖ నిర్మాణ సంస్థ.. సినిమా విడుదలకు ముందే మరో అవకాశం..
RX100 Karthikeya New Movie: 'ప్రేమతో మీ కార్తిక్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు హీరో కార్తికేయ. తొలి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేని కార్తికేయ.. రెండో చిత్రం 'ఆర్ ఎక్స్100తో' ఒక్కసారిగా...
RX100 Karthikeya New Movie: ‘ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు హీరో కార్తికేయ. తొలి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేని కార్తికేయ.. రెండో చిత్రం ‘ఆర్ ఎక్స్100తో’ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. చివరిగా ’90 ఎమ్‌ఎల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ.. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలను చేపడుతోన్న విషయం తెలిసిందే. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తికేయ మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఈ సినిమా తర్వాత కూడా నువ్వు మాకు అవసరం’ అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమేని తెలుస్తోంది. అయితే కేవలం గీతా ఆర్ట్స్ కాకుండా ఈ ప్రాజెక్టులో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి కానున్నట్లు టాక్. దీంతో రెండు క్రేజీ నిర్మాణ సంస్థలతో కార్తికేయ పనిచేయనున్నాడన్నమాట. బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి ‘చావు కబురు చల్లగా’ కార్తికేయకు ఎలాంటి హిట్‌ను అందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఓవైపు తెలుగులో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు.