AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాలి సంపత్ రివ్యూ : ఆద్యంతం ఆకట్టుకుంటున్న గాలిసంపత్.. ఫీ..ఫీ..ఫీ భాషతో అదరగొట్టిన నటకిరీటి రాజేంద్రప్రసాద్..

Gaali Sampath Movie Review : తెలుగు ఇండస్ట్రీలో అపజయం ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

గాలి సంపత్ రివ్యూ : ఆద్యంతం ఆకట్టుకుంటున్న గాలిసంపత్..  ఫీ..ఫీ..ఫీ భాషతో అదరగొట్టిన నటకిరీటి రాజేంద్రప్రసాద్..
uppula Raju
|

Updated on: Mar 12, 2021 | 4:46 PM

Share

Gaali Sampath Movie Review : తెలుగు ఇండస్ట్రీలో అపజయం తెలియని దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆయనతో పాటు కో-డైరెక్టర్‌గా, రచయితగా ట్రావెల్ చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణ గాలి సంపత్ ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక గాలిసంపత్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక తండ్రీ, కొడుకుల మధ్య నడిచే ఎమోషనల్ కథ. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. ఇద్దరివి వేర్వేరు దారులు. ఇద్దరికి క్షణం కూడా పడదు.

కథ విషయానికి వస్తే.. ఓ ప్రమాదంలో భార్యతో పాటు తన గొంతును పోగొట్టుకుంటాడు. మాట్లాడితే నోటిలో నుంచి ‘ఫీ ఫీ ఫీ’ అని గాలి మాత్రమే వస్తుంది. అందుకే ఇతన్ని గాలి సంపత్ అంటుంటారు. ఇతనికి నాటకాలంటే పిచ్చి.. అయితే గొంత పోవడంతో అందివచ్చే అవకాశాలు దూరమవుతూ ఉంటాయి. ఇక కొడుకు సూరి (శ్రీవిష్ణు) ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఒక ట్రక్ కొనుక్కొని దానికి ఓనర్ కావాలని ఆశపడుతూ ఉంటాడు.

ఇక తండ్రి, కొడుకుల మధ్యలోకి లవ్ పేరుతో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురితో హీరో ప్రేమలో పడతాడు. అయితే తండ్రి చేసే పనుల వల్ల ఆ ప్రేమ కాస్త దూరమవుతుంది. దీంతో సూరి తండ్రిపై కోపం పెంచుకొని సూటి పోటి మాటలతో నిందిస్తూ ఉంటాడు. ఓ రోజు బాగా గొడవ జరగడం అనుకోని ప్రమాదంలో తండ్రి చిక్కుకోవడం జరుగుతుంది. తర్వాత తన కోసం తండ్రి గతంలో ఏం చేసాడో కొడుకికి తెలియడం. కనిపించకుండా పోయిన తండ్రి కోసం వెతకడంతో సెంటిమెంట్ పండించాడు.

పాత్రల గురించి మాట్లాడుకుంటే.. ఫి..ఫి..ఫి భాషతో రాజేంద్రప్రసాద్ కామెడీ చాలా బాగా పండించాడు. శ్రీవిష్ణు సూరి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మధ్యతరగతి తండ్రి కొడుకులు ఎలాగైతే దెబ్బలాడుకుంటారో సరిగ్గా సినిమా అలాగే ఉంటుంది. సిని మా మొత్తం గాలి సంపత్ చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్‌లో తండ్రి గురించి నిజం తెలుసుకున్న తరువాత శ్రీ విష్ణు హావభావాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.

‘ఒక వయసు దాటాక తల్లిదండ్రులే బిడ్డలు అవుతారు.. మా నాన్న నాకు బిడ్డ.. ఆ బిడ్డను వెతుక్కోనివ్వండి సార్’.. అని చెప్పే డైలాగ్ అతనిలోని పరణితి ఉన్న నటుడికి అద్దం పట్టింది. రాజేంద్ర ప్రసాద్‌‌ కాంబినేషన్ సీన్స్‌లో ఆయనతో పోటీపడ్డాడు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. ఇక రాజేంద్రప్రసాద్ నవ్విస్తూ , ఏడ్పిస్తూ తన అనుభవాన్నంతా రంగరించి ఈ పాత్రలో ఒదిగిపోయాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ లవ్‌లీ సింగ్.. హీరోతో లవ్ ట్రాక్ కోసమే పెట్టినా పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. సినిమాలో కమెడియన్ సత్య పాత్ర చాలా కీలకం. గాలి సంపత్ పాత్రకి ట్రాన్స్‌లేటర్‌గా ఇరగదీశాడు. గాలి సంపత్ స్నేహితుడిగా తనికెళ్ల భరణి కీలకపాత్రలో కనిపించారు. కరాటే కళ్యాణి పంకజం పాత్రలో మెరిసింది. చివరగా సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి కొంచెం కామెడీ, కొంచెం సెంటిమెంట్‌తో కూడిన బొమ్మ కనిపిస్తుంది.

చిత్రం: గాలి సంపత్‌; నటీనటులు: రాజేంద్ర ప్రసాద్‌, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్‌, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు తదితరులు; సంగీతం: అచ్చు; సినిమాటోగ్రఫీ; సాయి శ్రీరామ్‌, ఎడిటింగ్‌; బి.తమ్మిరాజు, నిర్మాత: ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు, గారపాటి; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ: అనిల్‌ రావిపూడి; కథ, దర్శకత్వం: అనీశ్‌ కృష్ణ; బ్యానర్‌: ఇమేజ్‌స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, షైన్‌ స్క్రీన్స్‌; విడుదల 11-03-2021

మీ దగ్గర రూపాయి నోటు ఉందా..! అయితే సులువుగా 45 వేలు గెలుచుకోండి.. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి..