AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivaratri 2021 : లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు

హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు. ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగుతోంది...

Mahashivaratri 2021 : లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు
Surya Kala
| Edited By: Team Veegam|

Updated on: Mar 11, 2021 | 7:29 PM

Share

Mahashivaratri 2021 : హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు. ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగుతోంది. ఇక ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా శివరాత్రి సందర్భంగా లేపాక్షిలోని దుర్గా పాపనాశేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయాన్నే బాలకృష్ణ దంపతులు ఆలయానికి చేరుకొని మూలవిరాట్టు ని దర్శించుకున్నారు, శివుడికి శివరాత్రి సందర్భంగా అభిషేకం చేశారు.

ఆంధ్రపదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా బాలకృష్ణ సతీసమేతంగా హిందూపూర్ లోనే బస చేశారు. స్తానికంగా ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడే ఉండటంతో.. ఈరోజు శివరాత్రి వేడుకలను హిందూపూర్ లోనే జరుపుకుంటున్నారు.balakrishna

మరోవైపు బోయపాటి దర్శకత్వంలో మరో హిట్ మూవీకి బాలయ్య రెడీ అవుతున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.  సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న BB3 మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Telangana Coronavirus: తెలంగాణలో కరోనాతో 37,904 మంది మృతి.. వైరస్‌ బారిన 3,00,536 మంది

వావ్ అనిపిస్తున్న కోతుల విన్యాసం.. హాలీవుడ్ స్థాయిలో అద్బుత స్టంట్లు.. నెటిజన్లు ఫిదా.!

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం