Telangana Coronavirus: తెలంగాణలో కరోనాతో 37,904 మంది మృతి.. వైరస్‌ బారిన 3,00,536 మంది

Telangana Coronavirus: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకుంటే మళ్లీ మెల్లమెల్లగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే క..

Telangana Coronavirus: తెలంగాణలో కరోనాతో 37,904 మంది మృతి.. వైరస్‌ బారిన 3,00,536 మంది
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2021 | 11:33 AM

Telangana Coronavirus: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకుంటే మళ్లీ మెల్లమెల్లగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల వైరస్‌ అదుపులోకి వచ్చింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,904 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో కొత్తగా 194 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1649 మంది మృతి చెందారు. అలాగే మొత్తం ఇప్పటి వరకు 3,00,536 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటన్‌లో తెలిపింది. ఇక కరోనా బారి నుంచి నిన్న 116 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,97,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరిలో 730 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా జీహెచ్‌ఎంసీలో 35 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. పలు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా విజృంభిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సంవత్సరం పాటు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్న ఉద్యోగాలు పోయి, తినేందుకు తండిలేక, చేసుకునేందుకు పనులు లేక ఇబ్బందులకు గురై ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని పనులు చేసుకుంటుంటే మళ్లీ కేసులు పెరుగుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎదుర్కొన్న పరిస్థితి తిరిగి వస్తాయేమోనన్న భయంతో ఉన్నారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకోవద్దని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గాయని కొందరు నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చినా..కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. శుభకార్యాలయాల్లో, ఇతర కార్యక్రమాల్లో కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, లేకపోతే పెద్ద ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది.

ఇవి చదవండి :

COVID-19: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న బ్రెజిల్.. 80శాతం ఐసీయూలు ఫుల్.. నిన్న ఒక్క రోజే 1972 మంది మృతి..

Lockdown: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా ఆలోచన.. షాపుల వద్ద బారులు తీరుతున్న జనాలు

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.