COVID-19: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న బ్రెజిల్.. 80శాతం ఐసీయూలు ఫుల్.. నిన్న ఒక్క రోజే 1972 మంది మృతి..

బ్రెజిల్‌లో ప్రతీ రోజూ రెండు వేల మంది చనిపోతున్నారు. నిన్న ఒక్క రోజే 1972 మంది చనిపోయారు. దేశంలోని 27రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లోని కేపిటల్ సిటీల్లో ఉన్న ఆసుపత్రుల్లో బెడ్లన్నీ కోవిడ్‌ పేషంట్లతో..

COVID-19: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న బ్రెజిల్.. 80శాతం ఐసీయూలు ఫుల్.. నిన్న ఒక్క రోజే 1972 మంది మృతి..
Brazil
Follow us

|

Updated on: Mar 10, 2021 | 10:44 PM

Coronavirus: కోవిడ్ సెకండ్ వేవ్‌తో బ్రెజిల్ అల్లాడుతోంది. కరోనా పేషంట్లతో దేశంలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇకపై వచ్చే బాధితుల్ని చేర్చుకోవడానికి ప్లేస్ కూడా కనిపించడం లేదు. దేశంలోని 80శాతం ఐసీయూల్లో పేషంట్లు ఉన్నారు. బ్రెజిల్‌లో పీ వన్‌ వేరియంట్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది.

తొలి విడతలో అధ్యక్షుడి నిర్లక్ష్యంతో బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు అడ్డూ అదుపు లేకుండా పెరిగాయి. ఒక దశలో అంతా అదుపులోకి వచ్చిందనుకున్న తర్వాత.. సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. బ్రెజిల్‌లో ప్రతీ రోజూ రెండు వేల మంది చనిపోతున్నారు. నిన్న ఒక్క రోజే 1972 మంది చనిపోయారు. దేశంలోని 27రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లోని కేపిటల్ సిటీల్లో ఉన్న ఆసుపత్రుల్లో బెడ్లన్నీ కోవిడ్‌ పేషంట్లతో నిండిపోయాయి. యూకే, దక్షిణాఫ్రికా మాదిరిగానే బ్రెజిల్‌లోనూ కోవిడ్ కొత్త వేరియంట్ ఎక్కువగా విస్తరిస్తోంది.

బ్రెజిల్ వేరియంట్ ప్రపంచ మానవాళికి ముప్పుగా మారుతుందని స్థానిక ఎపిడమాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. బ్రెజిల్‌లో ఇప్పటి వరకూ కోటీ 11 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. రెండు లక్షల 66వేల మంది కరోనాతో చనిపోయారు. అమెరికా తర్వాత కోవిడ్ వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశం బ్రెజిల్. దేశంలో కేసులు పెరగడానికి అధ్యక్షుడు బోల్స్‌నారో విధానాలు కూడా కారణమే. బాధితుల్ని క్వారంటైన్ చేయడం, మాస్క్‌ వాడకాన్ని తప్పనిసరి చేయడం లాంటి కోవిడ్ కట్టడి నియమాలను బోల్స్‌నారో పట్టించుకోలేదు.

లాక్‌డౌన్ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రియోడిజనీరో, బ్రెసిలియా, సావ్‌పాలోతోపాటు 15 రాష్ట్రాల రాజధానుల్లో ఐసీయూ బెడ్లు 90 శాతం నిండిపోయాయి. పోర్ట్ అలగ్రే, క్యాంపో గ్రాండేలో ఐసీయూ బెడ్లకు కొరత కనిపిస్తోంది. దేశంలో హెల్త్ సిస్టమ్ కూలిపోయే పరిస్థితిలో ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మాస్ వ్యాక్సినేషన్ లేదా వైరస్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోకుంటే.. బ్రెజిల్ శవాల దిబ్బగా మారడం ఖాయం అంటున్నారు నిపుణులు.

నిన్న ఒక్క రోజే బ్రెజిల్‌లో 70వేల కొత్త కేసులు వెలుగు చూశాయి. గతవారంతో పోలిస్తే ఇది 38శాతం ఎక్కువ. బ్రెజిల్‌లో ప్రస్తుతం పీ వన్ రకం వేరియంట్ వేగంగా విస్తరిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ సావ్‌పాలో చెబుతోంది. ఈ వేరియంట్ అమెజాన్ సిటీలోని మానస్ ప్రాంతంలో పుట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కొత్తరకం వైరస్.. గతంలో ఉన్న వేరియంట్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఎదుర్కోగలదని.. ఒకసారి తగ్గిన తర్వాత మరోసారి వచ్చే అవకాశాలు 60 శాతం ఉన్నాయి.

ఏ విధంగా చూసినా బ్రెజిల్ వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. బ్రెజిల్ మ్యుటేషన్ ఆటంబాంబుకు ఏ మాత్రం తక్కువ కాదంటున్నారు కోవిడ్ 19 బ్రెజిల్ అబ్జర్వేటరీ హెడ్ రాబర్టో. వైరస్‌ను కట్టడి చేయడంలో బ్రెజిల్ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించకపోతే.. ఈ మ్యుటేషన్ పక్కనున్న దేశాలకు వేగంగా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. బ్రెజిల్ ప్రభుత్వం 20 కోట్ల వ్యాక్సిన్ల దిగుమతికి ఆర్డర్ చేసింది. మాస్ వ్యాక్సినేషన్‌లో బాగంగా.. దేశంలోని 4 శాతం ప్రజలకు మాత్రమే తొలి డోస్ ఇవ్వగలిగింది.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

Five Rupees Coins: 5, 10 రూపాయల కాయిన్స్ ఇవ్వండి.. లక్షలు తీసుకెళ్లండి.. హైదరాబాద్‌లో ఏం జరిగిందంటే..!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?