పాలమూరులో ఉపాధ్యాయుడు దారుణహత్య.. కారుతో ఢీకొట్టి, గొంతు కోసి హతమార్చిన దుండగులు..!

సాయం చేసిన వ్యక్తినే దారుణంగా హతమార్చారు దుండగులు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు హత్యకు గురయ్యాడు ఓ ఉపాధ్యాయుడు.

  • Balaraju Goud
  • Publish Date - 12:45 pm, Thu, 11 March 21
పాలమూరులో ఉపాధ్యాయుడు దారుణహత్య.. కారుతో ఢీకొట్టి, గొంతు కోసి హతమార్చిన దుండగులు..!

Mahbubnagar teacher murder: పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. అన్ని బంధాలు ఆర్థక బంధాలుగా మారాయి. సాయం చేసిన వ్యక్తినే దారుణంగా హతమార్చారు దుండగులు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దారుణహత్యకు గురయ్యాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఈ హత్యకు రియల్ ఎస్టేట్ లావాలదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

జిల్లా కేంద్రానికి చెందిన నరహరి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన జగదీష్ అనే రియల్టర్‌తో పరిచయం ఏర్పడింది. అయితే తన అవసరాల కోసం నరహరి వద్ద నుంచి జగదీష్ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అయితే, తిరిగి ఇచ్చేందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల తన సొమ్ము ఇవ్వాల్సిందిగా నరహరి ఒత్తిడి తీసుకువచ్చాడు. పదే పదే అడినప్పటికీ జగదీష్ దాటవేసుకుంటూ వచ్చాడు.

ఇదిలావుండగా బుధవారం అర్థరాత్రి బగీరధకాలనీలో బైకుపై వెళుతున్న నరహరిని గుర్తు తెలియని దుండగులు వెంబడించారు. వెనుకనుంచి కారుతో ఢీకొట్టి, అతికిరాతకంగా కత్తితో గొంతు కోసి హతమార్చారు. తీవ్ర రక్తమడుగులో పడి ఉన్న నరహరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నరహరి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటన స్థలంలో లభించిన కారు, ఇతర వస్తువులను బట్టి హత్యకు పాల్పడింది జగదీష్ అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డబ్బులు తీర్చమని ఒత్తిడి తీసుకువచ్చినందుకే నరహరిని హతమార్చేందుకు జగదీష్ ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః

 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పురోగతి.. మరో ఆర్మీ ఉన్నతాధికారి అరెస్ట్..

టీవీ లైవ్ లో స్టూడియో సెట్ కూలి ప్రెజెంటర్ కు స్వల్ప గాయాలు, చర్చా గోష్ఠికి బ్రేక్