AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పురోగతి.. మరో ఆర్మీ ఉన్నతాధికారి అరెస్ట్..

ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మహారాష్ట్ర పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఆర్మీ ఉన్నతాధికారిని పూణే పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పురోగతి.. మరో ఆర్మీ ఉన్నతాధికారి అరెస్ట్..
transgenders arrest
Balaraju Goud
|

Updated on: Mar 11, 2021 | 12:16 PM

Share

soldier recruitment exam paper leak case : ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మహారాష్ట్ర పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఆర్మీ ఉన్నతాధికారిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్మీ మేజర్ రిక్రూట్ మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయన్ను ఢిల్లీలో అదుపులో తీసుకున్న పోలీసులు.. పూణేకు తీసుకువచ్చారు. ఆర్మీ మేజరును పూణే అదనపు సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 15వతేదీల వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

కాగా ప్రశ్నపత్రం లీక్ కేసుకు సంబంధించి, గతంలో అతని బ్యాచ్ మేట్ అయిన మరో ఆర్మీ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన నిందితుడుగా భావిస్తూ ఆర్మీ మేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఇతరులకు పంపించాడని పోలీసుల విచారణలో తేలింది. పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా మంగళవారం ఒక అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించారు. అయితే, ఆ అధికారి గురించి, ఈ కేసులో అతని ఖచ్చితమైన పాత్ర గురించిన సమాచారం వెల్లడించడానికి నిరాకరించారు.

ఇదిలావుంటే, నిందితుడు తన సెల్‌ఫోన్‌ను నీళ్లలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో దెబ్బతిన్న సెల్‌ఫోన్ డాటాను పునరుద్ధరించే పనిలో పోలీసులు పడ్డారు. పూణే కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నవేందర్ ఈ కేసులో నిందితుడైన ఆర్మీ మేజరును పోలీసు కస్టడీకి పంపించారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసును పూణే పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ లీకేజీ బాగోతంలో మిలటరీ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే సంస్థలతోపాటు మాజీ సైనికులు, సైనికాధికారుల పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటికే పోలీసులు 10 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్మీ (జనరల్ డ్యూటీ) నియామకం కోసం కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఒక ప్రశ్నపత్రం లీక్ జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు చేసింది ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు. లీక్ వ్యవహరం వెలుగులోకి వచ్చిన తరువాత పూణే పోలీసులు.. వనావాడి, విశ్రాంత్వాడి పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులను నమోదు చేశారు. దీంతో పూణే క్రైమ్ బ్రాంచ్, మిలటరీ ఇంటెలిజెన్స్ రెండు వేర్వేరు బృందాలు పరీక్షా ప్రక్రియకు సంబంధించి విచారణ చేపట్టాయి.

Read Also…  ద్రవిడ ఎన్నికలకు దండు కదిలింది.. కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. జోరందుకున్న ప్రచారం