ద్రవిడ ఎన్నికలకు దండు కదిలింది.. కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. జోరందుకున్న ప్రచారం

తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య పొత్తుల కుదురుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో సహా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు.

ద్రవిడ ఎన్నికలకు దండు కదిలింది.. కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. జోరందుకున్న ప్రచారం
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 11, 2021 | 11:42 AM

tamilnadu assembly election 2021 : తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య పొత్తుల కుదురుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కిరాగా.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటుడు కమల్‌ హసన్‌ పలు పార్టీలో కలిసి పోటీకి సిద్ధమవుతున్నారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఒక విడతలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది

ఇప్పటికే రేసుగుర్రాల లిస్టులు బయటికొస్తుండటంతో.. సీటు దక్కని అసంతృప్తులు భగ్గుమంటున్నారు. తమకు టికెట్‌ ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య సీట్ల వివాదం మరింత రాజుకుంది. తమకు ఛాన్స్‌ దక్కలేదంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే భగ్గుమంటున్నారు. ముగ్గురు మంత్రులు సహా 47 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు కోల్పోయిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిఫ్యూటీ సీఎం పన్నీర్‌ వర్గానికి చెందినవారే కావడం విశేషం0. వీరంతా పన్నీర్‌ సెల్వం కోసం గతంలో రాజీనామా చేసిన వారే. తమకు సీట్లు దక్కకపోవడంతో పన్నీర్‌పై విరుచుకుపడుతున్నారు.

తొలుత ఆరుగురి పేర్లతో మొదటి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే.. 171 మంది అభ్యర్థులతో రెండో జాబితా రిలీజ్‌ చేసింది. ఇదే ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల్లో చిచ్చు మొదలైంది. ముఖ్యంగా పన్నీర్‌సెల్వం వర్గంలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. పార్టీ కోసం కష్టపడుతున్న తమను కాదని.. వేరేవారికి టికెట్‌ ఇచ్చారంటూ మండిపడుతున్నారు. ఇప్పటివరకు 177మంది అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది అన్నాడీఎంకే. ఇక, మిగిలిన సీట్లను మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ, పీఎంకేకు కేటాయించింది. బీజేపీకి 20 సీట్లు కేటాయించిన రెండాకుల పార్టీ.. పీఎంకేకు 23 సీట్లిచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

మరోవైపు, థర్డ్‌ ఫ్రంట్‌తో తమిళ రాజకీయాల్లో దుమారం లేపిన కమల్‌హాసన్‌ 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) బరిలో దిగతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. కూటమిలో భాగస్వాములైన ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చికి 80 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 71 మంది అభ్యర్ధులతో తొలిజాబితాను విడుదల చేశారు. అయితే, తాను పోటీ చేస్తున్న స్థానం పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు కమల్‌. గతంలో మాజీ సీఎం ఎంజీ రాంచంద్రన్‌ ప్రాతినిధ్యం వహించిన అలందూర్‌ నుంచి కమల్‌ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 154 స్థానాల్లో పోటీకి రెడీ అయిన కమల్‌హాసన్‌..శరత్‌కుమార్‌ నేతృత్వంలోని ఎస్‌ఎంకేకేకి 40, ఐజేకేకు మరో 40 స్థానాలను కేటాయించారు. కాగా, విజయ్‌కాంత్‌ పార్టీతో పాటు ఎస్‌డీపీఐతో కూడా పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు కమల్‌హాసన్‌.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం నాలుగు శాతం ఓట్లు సాధించింది. పట్టణంలో ఓటింగ్‌ 10 శాతం అధికంగా ఉంది. ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి డాక్టర్ ఆర్ మహేంద్రన్ మొత్తం ఓట్లలో 11.6 శాతం సాధించారు. ఇదిలా ఉండగా.. పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు, దినకరన్‌ పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. 15 మందితో మొదటి జాబితాను విడుదల చేశారు. ఇక, దినకరన్‌ స్థాపించిన ఎఎంఎంకేతో కలిసి పోటీకి దిగుతోంది మజ్లిస్ పార్టీ. మూడు స్థానాల్లో ఢీ అంటే ఢీ అంటోంది. వానియం బాడీ, కృష్ణగిరి, శంకరాపురం స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక, ఇటు ప్రతిపక్ష డీఎంకే ఈసారి ఎలాగైనా పవర్‌లోకి రావాలని విశ్వప్రయత్నాలు మొదలు పెట్టింది. కూటమిలో ఇప్పటికే సీట్లు సర్ధుబాటు పూర్తయ్యింది. పార్టీ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసి ఎన్నికల యుద్దంలో ముందంజలో ఉన్నారు పార్టీ అధినేత స్టాలిన్‌.

మరోవైపు, ఇటీవలే బీజేపీలో చేరిన సినీ నటి కుష్బూకు మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని చెపాక్‌ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు కుష్బూ. అయితే, ఆమె ఆశలపై నీళ్లు చల్లింది కాషాయం పార్టీ. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా..ఆ స్థానాన్ని పీఎంకేకు కేటాయించడంతో.. కుష్బూ పోటీకి ఛాన్స్‌ లేకుండాపోయింది. అయితే, టికెట్‌ రాకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటున్నారు కుష్బూ.

Read Also…  చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు క్వాడ్ వ్యుహం.. తొలిసారిగా భేటీ అవుతున్న చతుర్భుజ భద్రతా కూటమి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!