Crispy Prawns Pakoda : నాన్ వెజ్ ప్రియులు రెగ్యులర్ స్నాక్స్ తో విసిగిపోయారా.. వారికోసమే రొయ్యల పకోడీ రెసిపీ
నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఆహారపదార్ధాల్లో ఒకటి రొయ్యలు. వీటిని ఎక్కువుగా కూరగానో.. లేదంటే ఫ్రై గా నో చేసుకుంటారు.. ఇక కొంతమంది రొయ్యల బిర్యానీగా కూడా చేసుకుని తింటారు.. అయితే రొయ్యల తో స్నాక్ ఐటెం...
Crispy Prawns Pakoda : నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఆహారపదార్ధాల్లో ఒకటి రొయ్యలు. వీటిని ఎక్కువుగా కూరగానో.. లేదంటే ఫ్రై గానో చేసుకుంటారు.. ఇక కొంతమంది రొయ్యల బిర్యానీగా కూడా చేసుకుని తింటారు.. అయితే రొయ్యల తో స్నాక్ ఐటెం చాలా తక్కువమంది ట్రై చేస్తారు.. రొయ్యల పకోడీని చాలా ఈజీగా రుచికరంగా చేసుకోవచ్చు.. ఇది అందరికీ నచ్చే స్నాక్ ఐటెం.. ఈరోజు తయారీ విధానము తేలుకుందాం..!
రొయ్యల పకోడీకి కావలసిన పదార్ధాలు :
రొయ్యలు – 1/2 కేజీ శనగపిండి – 1 కప్పు, కార్న్ ప్లోర్ (టి స్పూన్) అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను, వంటసోడా – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, కారం – అర టీ స్పూను, చాట్ మసాలా – అర టీ స్పూను, గరం మసాలా – పావు టీ స్పూను, పచ్చిమిర్చి – 2, కరివేపాకు – గుప్పెడు, కొత్తిమీర తరుగు – 1 టేబుల్‌స్పూను, ఉల్లి తరుగు – కప్పు, నూనె – వేగించడానికి సరిపడా నిమ్మకాయ (ఒకటి )
తయారీ విధానం :
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా వార్చుకోవాలి. ఒక పాత్రలో ఉల్లిపాయముక్కలు, కర్వేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు , గరంమసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, శనగపిండి, కార్న్ ప్లోర్, వంటసోడా, వేసుకుని కలుపుకోవాలి. అనంతరం కొంచెం నీరు చల్లుకుని పకోడీ పేస్ట్ లా కలుపుకుని.. ఉప్పు చూడాలి.. రుచికి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకుని అన్ని కలుపుకున్న పిండిలో రొయ్యలను వేసి.. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి.
అరగంట తర్వాత గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.. తర్వాత ఆ పిండిని పకోడీ మాదిరిగా వేసుకుని గోల్డెన్ బ్రవున్ కలర్ లోకి వచ్చే వరకూ వేయించుకోవాలి. పకోడీని నూనె పీల్చే కాగితంపై కాసేపు ఉంచాలి. వాటి మీద చాట్ మసాలా చల్లితే బాగుంటుంది. ఇష్టమైన వారు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీ టేస్టీ రొయ్యల పకోడీ రెడీ.. కొంతమంది నిమ్మకాయను బదులు కెచప్ కాంబినేషన్ తో తింటారు..
సముద్రపు రొయ్యల్లో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు ఈరొయ్యలు తినడంవల్ల బరువు పెరగరు. ఇక మన శరీరానికి కావాల్సిన అనేక రకాలు పోషకాలు, ఖనిజాలను కూడా అందిస్తాయి.
Also Read: