4G Network: మీ మొబైల్‌లో 4జీ నెట్ వర్క్ సరిగ్గా రావడం లేదా..? స్పీడు తగ్గిందా..? ఇలా చేస్తే స్పీడ్ పెంచుకోవచ్చు
4G Network: ప్రస్తుతం 4జీ కొనసాగుతోంది. ఇక రాబోయే 5జీపై ఉంది అందరి దృష్టి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో 4జీ నెట్ వర్క్ సరిగ్గా లేదు. ఒక వేళ ఉన్నా.. 4జీ సరిగ్గా రాదు...

4G Network: ప్రస్తుతం 4జీ కొనసాగుతోంది. ఇక రాబోయే 5జీపై ఉంది అందరి దృష్టి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో 4జీ నెట్ వర్క్ సరిగ్గా లేదు. ఒక వేళ ఉన్నా.. 4జీ సరిగ్గా రాదు. దీంతో ఇంటర్నెట్‌కు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఒక వేళ 4జీ వచ్చినా.. స్పీడు పెద్దగా ఉండదు. స్లోగా ఉంటుంది. అలాగే ఫోన్‌లలో కూడా సెట్టింగ్‌లలో సమస్య ఉంటే కూడా నెట్ వర్క్ స్పీడ్ సరిగ్గా ఉండదు. అవనసరమైన యాప్స్ కారణంగా నెట్‌తో పాటు ఫోన్ కూడా నెమ్మదిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ మొబైల్‌లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలి. మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడు.. మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు.. ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్ టవర్‌ను ఉపయోగిస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువ రావడం గమనించవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో మన మొబైల్‌లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్ కారణంగా కూడా డేటా స్పీడ్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా 4జీఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్‌ల సంఖ్య రోజురోజుకు పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్టమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్‌లో 4జీ వేగాన్ని మెరుగుపర్చడానికి కొన్ని పదుతులను తెలుసుకుంటే మీ ఇంటర్నెట్ వేగం కొంతైనా పెంచుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ స్పీడ్ కోసం మొబైల్‌లో సెట్టింగ్ చేసుకోండిలా..
► ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి మొబైల్ నెట్ వర్క్‌ల ద్వారా 4జీను ఎనేబుల్ చేయండి.
► మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్‌కు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్‌ను డిఫాల్టుగా రీసెట్ చేయండి.
► కొన్ని అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తాయి. – వాటిని ఆన్ ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపివేయడం ఉత్తమం.
► 4 జీ ఇంటర్నెట్ సరిగ్గా రాని సందర్భంలో ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం ఎంతో మంచిది. కొన్నిప్రత్యేక సందర్భాలలో మీ నెట్ వర్క్ సెట్టింగ్‌ను రీసెట్ చేయడం మంచిది.
అయితే మొబైల్‌లో ఇలాంటి చిన్న చిన్న నెట్‌వర్క్ సెట్టింగ్‌ల కారణంగా కూడా ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోతుంది. మీ ఫోన్‌లలో కొన్ని అనవసరమైన యాప్ప్ ఉంటాయి. వాటిని ఆన్‌ఇస్టాల్ చేయడం లాంటివి చేస్తే బాగుంటుంది.
Also Read: PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండు నెలలకు మైదానంలో అడుగుపెట్టిన టీం ఇండియా ఆల్‌రౌండర్..
Indian Railway: ట్రైన్ జర్నీ.. మిడిల్ బెర్త్‌లో ఎప్పుడు పడితే అప్పుడు పడుకోలేరు.. ఎందుకంటే..?