AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat E-Market: ఇక ఆ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. అందుబాటులోకి ‘భారత్ ఈ-మార్కెట్’ యాప్..

Bharat e Market APP: మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే.. ఇక మీరు విదేశీ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేదు. దీనికోసం..

Bharat E-Market: ఇక ఆ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. అందుబాటులోకి ‘భారత్ ఈ-మార్కెట్’ యాప్..
Bharat e Market
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2021 | 8:45 PM

Share

Bharat e Market APP: మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే.. ఇక మీరు విదేశీ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేదు. దీనికోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ స్వదేశీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) వెండర్ మొబైల్ అప్లికేషన్ ‘భారత్ ఈ-మార్కెట్‌’ను ప్రారంభించింది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర లాంటి సంస్థలపై ఆధారపడవలసిన అవసరంలేదని ప్రముఖులు పేర్కొన్నారు. సుమారు 8 కోట్ల మంది వ్యాపారుల భాగస్వామ్య సంస్థ అయిన సీఏఐటీ.. వెండర్ మొబైల్ అప్లికేషన్ ‘భారత్ ఈ మార్కెట్‌’ యాప్‌ను గురువారం ఢిల్లీలో ప్రారంభించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇది పూర్తిగా దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సులభ డెలివరీ, వినూత్న మార్కెటింగ్, సమర్థవంతమైన డిజిటల్ చెల్లింపులతో పారదర్శక, బాధ్యతాయుతమైన వాణిజ్య వ్యవస్థ ఆధారంగా భారత్ ఈ-మార్కెట్‌ను ప్రారంభించినట్లు కాట్ వెల్లడించింది. ఇది భారత్‌తోనే కాకుండా ప్రపంచంలోని ఈ -కామర్స్ పోర్టల్‌తోనూ పోటీపడుతుంది. భారత్ ఈ-మార్కెట్లో చౌక ధరలకు వస్తువులు.. సేవలను అందిస్తుందని.. ఇది వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సీఏఐటీ పేర్కొంది.

భారత్‌లో స్వదేశీ ఈ-కామర్స్ పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం దీనిలో పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు భాగస్వామ్యమయ్యారు. దీనిలో గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు అన్ని రంగాల వినియోగదారులను అనుసంధానించనున్నారు. ఈ సందర్భంగా క్యాట్ జాతీయ అధ్యక్షుడు బి.సి.భార్తియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ కోసం పిలుపునిచ్చారని.. దీంతో భారత్ ఈ మార్కెట్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు దృష్టిసారించామని వెల్లడించారు.

భారత్ ఈ-మార్కెట్ ప్రత్యేకత.. ఈ పోర్టల్‌లో వ్యాపారి.. వ్యాపారికి.. వ్యాపారి.. వినియోగదారునికి వస్తువులను విక్రయించవచ్చు.. కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ‘ఈ-షాప్’ ప్రారంభించేందుకు ప్రతీ వ్యక్తి మొదట మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో పూర్తిగా స్వదేశీ వస్తువులు మాత్రమే ఉంటాయి. వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. దీనిలో చైనా వస్తువులను విక్రయించారు. స్థానిక చేతివృత్తులవారు, హస్తకళాకారులు, పలువురు తయారు చేసిన వస్తువులను ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ పోర్టల్‌లో వ్యాపారం చేయడానికి ఎలాంటి రుసుంలు వసూలు చేయరు.

Also Read:

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా