మహారాష్ట్రలో కరోనా విజృంభణ గత 24 గంటల్లో 14,317 మందికి పాజిటివ్.. 57 మృతి
రోజువారీ కరోనా కేసుల నమోదు 14 వేలు దాటింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కొత్తగా 14,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 24 గంటల్లోనే 57 మంది మృతి..
మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో చాల దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.
రోజువారీ కరోనా కేసుల నమోదు 14 వేలు దాటింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కొత్తగా 14,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 24 గంటల్లోనే 57 మంది మృతి చెందినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కోవడ్ కేసుల సంఖ్య 22,66,374కు, మరణాల సంఖ్య 52,667కు చేరింది.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 7193 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,06,400కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,070 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా తీవత్ర నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
Maharashtra reports 14,317 new #COVID19 cases, 7193 discharges and 57 deaths in last 24 hours.
Total cases 22,66,374 Total recoveries 21,06,400 Death toll 52,667
Active cases 1,06,070 pic.twitter.com/ANPXCVeRDl
— ANI (@ANI) March 11, 2021
లావుంటే .. కంద్ర ప్రభుత్వం మహారాష్ట్రతోపాటు మరో నాలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని హెచ్చరించింది.దేశం వ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది . ఈ సందర్భంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వెల్లడించింది. మహారాష్ట్రలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణాలోనూ అలాంటి పరిస్థితే ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశమైనట్లు తెలిపింది. కేసుల పెరుగుదలకు ప్రధానంగా టెస్టులు, కేసుల ట్రేసింగ్ తగ్గించటం, కొవిడ్ పట్ల ప్రజల నిర్లక్ష్యం, పెద్ద ఎత్తున సమావేశాలే కారణమని అ ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.