Indian Football Captain: భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్‌.. ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన సునీల్‌..

భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సునీల్‌ స్వయంగా తెలిపాడు. ఇదిలా ఉంటే సునీల్‌ ఛెత్రి గతకొన్ని రోజుల క్రితం గోవాలో జరిగిన ఇండియన్‌ సూపర్‌...

Indian Football Captain: భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్‌.. ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన సునీల్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 11, 2021 | 5:17 PM

Sunil Chhetri Tests Positive For Covid-19: వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా కరోనా తన పంజాను విసురుతూనే ఉంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్లీ తన పంజాను విసురుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. ఇక క్రీడారంగంలోనూ కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సునీల్‌ స్వయంగా తెలిపాడు. ఇదిలా ఉంటే సునీల్‌ ఛెత్రి గతకొన్ని రోజుల క్రితం గోవాలో జరిగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఆడాడు. ఈ టోర్నీలో సునీల్‌ బెంగళూరు ఎఫ్‌సీ తరపున ఆడాడు. తనకు కరోనా పాజిటివ్‌ అని తెలిపిన సునీల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఇది శుభవార్త కాదు.. నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. వైరస్‌ నుంచి క్రమంగా కోలుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ ఫుట్‌ బాల్‌ మైదానంలోకి అడుగుపెడతాను. కరోనా విషయంలో ఎవరూ అజాగ్రత్తగా ఉండకండి.. ప్రతీ ఒక్కరూ తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో భారత ఫుట్‌ బాల్‌ జట్టు ఒమన్‌, యూఏఈ జట్లతో ఆడనున్న మ్యాచ్‌లో భాగంగా ఎంపిక చేసిన 35 మంది టీమ్‌ సభ్యుల జాబితాలో సునీల్‌ కూడా ఉన్నాడు. మార్చి 25న ఒమన్‌, 29న యూఏఈతో మ్యాచ్‌ జరగనుంది. మరి సునీల్‌ ఛెత్రి అంతలోపు కరోనా నుంచి కోలుకొని మ్యాచ్‌లు ఆడతాడో లేదో చూడాలి.

Also Read: India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!

IPL 2021: ఆర్సీబీకి కొత్త వికెట్ కీపర్.. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపిన ప్లేయర్.. అతడేవరంటే.!

Pics: తొలి టీ20: సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశే.. ఓపెనర్‌గా రాహుల్.. తుది జట్టులో కీలక మార్పులు!