ఢిల్లీలో మళ్ళీ కరోనా మహమ్మారి, ఒకే రోజున 409 కేసులు నమోదు, నిర్లక్ష్యం తగదంటున్న నిపుణులు
ఢిల్లీలో గురువారం కొత్తగా 409 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తరువాత ఒకే రోజున ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఢిల్లీలో గురువారం కొత్తగా 409 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తరువాత ఒకే రోజున ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. పాజిటివిటీ రేటు 0.59 శాతం పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించినప్పటికీ కొత్తగా ఇన్ని కేసులు నమోదుకావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రోగులు మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 10,934 కి పెరిగింది. గత మంగళవారం 320, బుధవారం 370 కేసులు నమోదయ్యాయని, ఆది, సోమ వారాల్లో మొత్తం 515 కేసులు రిజిస్టర్ అయ్యాయని ఈ శాఖ వెల్లడించింది. ప్రజలు కోవిడ్ నిబంధనలను, ప్రొటొకాల్స్ ను సరిగా పాటించకపోవడం, వారి బిహేవియర్ లో మార్పు రావడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ఇక కరోనా భయం లేనట్టేనన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణంగా వారు అభిప్రాయపడ్డారు.
కాగా- దేశంలో గురువారం తాజాగా 22,854 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రెండున్నర నెలల తరువాత మళ్ళీ ఇంత అధికంగా ఇవి నమోదు కావడం ఇదే ప్రథమమని ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు మహారాష్ట్రలో ఈ మహమ్మారి తిరిగి విజృంభించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్రంలో కొన్ని నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించే సూచనలున్నాయని పేర్కొంది. ఆ మధ్య మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టినప్పటికీ తిరిగి పెరుగుతున్నాయి. దీంత రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే స్వయంగా కలవరం వ్యక్తం చేశారు. అటు- నాగ్ పూర్ లో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు ఇంకా అధికంగా నమోదవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి:
Mount Kailash: మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఓ రహస్యం… హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు
రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..