AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccine : కోవిడ్-19 వ్యాక్సిన్ నరేంద్ర మోడీ తల్లి.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించింది.చిన్న-పెద్ద, పేద- గొప్ప బేధం లేకుండా ప్రజలాంజీవనాన్ని అల్లకల్లోలం చేసింది. అయితే ఇప్పుడు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

COVID-19 vaccine : కోవిడ్-19 వ్యాక్సిన్ నరేంద్ర మోడీ తల్లి.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2021 | 1:43 AM

Share

COVID-19 vaccine : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించింది.చిన్న-పెద్ద, పేద- గొప్ప బేధం లేకుండా ప్రజలాంజీవనాన్ని అల్లకల్లోలం చేసింది. అయితే ఇప్పుడు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మార్చి 1న రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటినుంచి ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ త‌ల్లి హీరాబెన్ మోడీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఆమెకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప్రధాని మోడీ ట్విట‌్టర్ ద్వారా వెల్లడించారు.

మా అమ్మ ఈ రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. వ్యాక్సిన్‌కు అర్హత కలిగిన మీ చుట్టు పక్కల వారిని వ్యాక్సిన్ తీసుకునేలా అందరూ ప్రోత్సహించాలని సూచిస్తున్నానంటూ మోడీ ట్వీట్‌ చేశారు. కాగా, రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

ఇక, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్ కూడా ఇవాళే తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు,దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు గురువారం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఢిల్లీలో మళ్ళీ కరోనా మహమ్మారి, ఒకే రోజున 409 కేసులు నమోదు, నిర్లక్ష్యం తగదంటున్న నిపుణులు

Photo Gallery: ఈసారి ముంబైలో ప్రత్యక్షమైన మిస్టరీ స్తంభం..ఎవరైనా కావాలని చేస్తున్న పనా? లేదా.. ఏలియన్స్..?

Rafale aircraft: ఏప్రిల్‌లో రాఫెల్‌ రెండవ స్క్వాడ్రన్‌.. వాయుసేనలో చేరనున్న అత్యాధునిక జెట్స్..