Rafale aircraft: ఏప్రిల్‌లో రాఫెల్‌ రెండవ స్క్వాడ్రన్‌.. వాయుసేనలో చేరనున్న అత్యాధునిక జెట్స్..

Rafale fighter aircraft: భారత్-చైనా దేశాల మధ్య ఏడాది కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇటీవల తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. చైనా సరిహద్దు వెంబడి..

Rafale aircraft: ఏప్రిల్‌లో రాఫెల్‌ రెండవ స్క్వాడ్రన్‌.. వాయుసేనలో చేరనున్న అత్యాధునిక జెట్స్..
Dassault Rafale
Follow us

|

Updated on: Mar 11, 2021 | 9:34 PM

Rafale fighter aircraft: భారత్-చైనా దేశాల మధ్య ఏడాది కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇటీవల తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. చైనా సరిహద్దు వెంబడి సరిహద్దుల్లో భద్రత పరంగా బలోపేతం చేసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల రెండవ స్క్వాడ్రన్‌ను ఏప్రిల్‌లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని అలీపూర్దుర్ జిల్లా హశీమారా వైమానిక స్థావరంలో వీటిని మోహరించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మే నాటికి రాఫెల్‌ రెండవ స్క్వాడ్రన్‌ తరలింపు పూర్తవుతుందని, ఆ సమయానికి ఫ్రాన్స్‌లో పైలట్ల శిక్షణ పూర్తవుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌ 10న పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ స్టేషన్‌లో తొలి రాఫెల్‌ స్క్వాడ్రన్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఏఎఫ్‌లోకి లాంఛనంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వైమానిక స్థావరంలోని ‘గోల్డెన్‌ యారోస్‌’ స్క్వాడ్రన్‌లో ఈ రాఫేల్ జెట్లను చేర్చారు. దీంతోపాటు ఇటీవల మరికొన్ని రాఫెల్స్‌ జెట్స్ భారత్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ మధ్యలో పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో రెండవ రాఫెల్‌ స్క్వాడ్రన్‌ను ఐఏఎఫ్‌లో ప్రవేశపెట్టనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. అప్పటికల్లా పైలట్ల శిక్షణ పూర్తవుతుందని రక్షణ శాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్‌ జెట్స్‌ భారత్‌కు చేరాయి. రెండో బ్యాచ్‌లో భాగంగా 3 రాఫెల్ జెట్స్ నవంబర్‌లో భారత్‌కు చేరాయి. కాగా.. 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Also Read:

Bharat E-Market: ఇక ఆ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. అందుబాటులోకి ‘భారత్ ఈ-మార్కెట్’ యాప్..

బ్లాక్ లిస్ట్‌లో చేరనున్న మరో చైనా కంపెనీ.. ఆ సంస్థ ఉత్పత్తులపై వేటు వేసే ఆలోచనల్లో భారత్..!

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..