బ్లాక్ లిస్ట్‌లో చేరనున్న మరో చైనా కంపెనీ.. ఆ సంస్థ ఉత్పత్తులపై వేటు వేసే ఆలోచనల్లో భారత్..!
China's Huawei: తాజాగా మరో కంపెనీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. బ్లాక్లిస్ట్ జాబితాలో హువావేని చేర్చే అవకాశం ఉందని ఇద్దరు అధికారులు..
India likely to block China’s Huawei: సరిహద్దుల్లో ఏ మాత్రం నమ్మకూడని శత్రువు చైనా. ఓ చేత్తో షేక్‌హ్యాండ్ ఇస్తూనే.. మరో చేత్తో గొంతు కోసే నైజం డ్రాగన్ దేశంది. అయితే దేశాలను దొంగ దెబ్బ తీసేందుకు అన్ని మార్గాలను వెతుకుంటోంది. తాజాగా అక్కడి టెక్ దిగ్గజం హువావేను కూడా వినియోగించకుంటున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే భారత్.. ఆతర్వాత అమెరికా.. ఇదే వరుసలో బ్రిటన్.. వాదిస్తున్నట్టు నిజంగానే చైనా కంపెనీలు ఆయా దేశాల భద్రతకు ముప్పుగా పరిణమించాయా..? వివిధ దేశాల సమాచారాన్నిచైనా కంపెనీలు తమ ప్రభుత్వానికి అందిస్తున్నాయా అంటే అవు అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన కంపెనీల్ని ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా కాదంటున్నాయి. చైనా దేశానికి చెందిన 59 యాప్ లను ముందు భారత్ ఇప్పటికే నిషేధించింది.
అయితే తాజాగా మరో కంపెనీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. చైనా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న టెలికాం పరికరాలను ఉపయోగించకుండా నిరోధించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
మొబైల్ ఫోన్లతో హువావే పేరుగాంచింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరుంది. అలాగే, భారీ సమాచార వ్యవస్థ పరికరాలను కూడా ఈ చైనా దిగ్గజ కంపెనీ తయారు చేస్తోంది. హువావేని అరికట్టడానికి అది ఉత్పత్తి చేస్తున్న పరికరాల వాడకంపై నిషేధాలు పెట్టే ఆలోచనలో ఉంది కేంద్రం. అయితే ఆ కంపెనీ వ్యవహారాలను భారత్‌లో కూడా విస్తరించాలని చూస్తోంది.
హువావే సంస్థకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సైనిక పరికరాలతో సంబంధముందని గతంలో అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. భారత టెలికాం శాఖ పలు కీలక అంశాలను వెల్లడించింది. జూన్ 15 తరువాత చైనా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల దిగుమతులను నిలువరించే ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలిపింది. బ్లాక్లిస్ట్ జాబితాలో హువావేని చేర్చే అవకాశం ఉందని ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.