AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..

Girlfriend Commits Suicide: ఆ ఇద్దరు కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరగారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేనన్నారు. చివరకు పెళ్లి సమయానికి వచ్చేసరికి

రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..
uppula Raju
|

Updated on: Mar 11, 2021 | 8:36 PM

Share

Girlfriend Commits Suicide: ఆ ఇద్దరు కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరగారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేనన్నారు. చివరకు పెళ్లి సమయానికి వచ్చేసరికి అబ్బాయి ప్లేట్ పిరాయించాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యం చేసుకుంది. నిజామాబాద్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవపల్లి గ్రామానికి చెందిన యువతి .. చుట్టాలైన లింగంపేట్‌ మండలం కొర్పోల్‌ గ్రామానికి చెందిర కర్రెల్లో స్వామితో గత రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇద్దరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు ఎలాగోలా ఒప్పుకొని పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే కొన్ని రోజులకు అబ్బాయి ప్లేట్ ఫిరాయించాడు. కొత్తగా ప్రేమ పోయి కట్నం గురించి యువతిని వేధించసాగాడు. తనకు రూ.2 లక్షల నగదుతో పాటు ఓ బైక్‌ను ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. లేదంటే పెళ్లి చేసుకోనని వేరే అమ్మాయిని చూసుకుంటానని బెదిరించసాగాడు.

అయితే పెద్దలు నిర్ణయించిన ప్రకారం పెళ్లి చేసుకోవాలని యువతి డిమాండ్ చేసింది. ఈ క్రమంలో గత నెల 18న యువతి  ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు స్వామితో వీడియో కాల్‌లో మాట్లాడింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరింది. అప్పటికి ప్రియుడు ఒప్పుకోకపోవడంతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. వెంటనే గమనించిన స్వామి హుటాహుటినా బయలుదేరి సౌందర్య ఇంటికి వచ్చి ఆమెను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల2న నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి తండ్రి రాయల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని చదవండి :

Deepika Padukone : ఫిట్‌నెస్ అంటే కనిపించే శరీరం కాదు.. దానికి వేరే అర్థం చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..