Deepika Padukone : ఫిట్‌నెస్ అంటే కనిపించే శరీరం కాదు.. దానికి వేరే అర్థం చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..

Deepika Padukone : ఫిట్‌నెస్ గురించి ఆసక్తికరమైన సంగతులు చెబుతుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె.. ఇటీవల ఒక పోషాకాహార సంస్థకు బాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన దీపికా

Deepika Padukone : ఫిట్‌నెస్ అంటే కనిపించే శరీరం కాదు..  దానికి వేరే అర్థం చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..
Follow us
uppula Raju

|

Updated on: Mar 11, 2021 | 7:42 PM

Deepika Padukone : ఫిట్‌నెస్ గురించి ఆసక్తికరమైన సంగతులు చెబుతుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె.. ఇటీవల ఒక పోషాకాహార సంస్థకు బాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన దీపికా అసలైన ఫిట్‌నెస్ గురించి సెలవిస్తోంది. బయటకు కనిపించే శరీరాన్ని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్‌ నిర్ధారించలేమని, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్‌నెస్‌ అని ఆమె వెల్లడించింది. శరీరానికి, మనస్సుకు మధ్య ఉండే అసలైన సంబంధమే ఫిట్‌నెస్‌ని సూచిస్తుందని చెప్పుకొచ్చింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. అందుకోసం డేట్స్ కూడా సిద్ధం చేసుకుంది. వివాహమైన తర్వాత సినిమాల్లో నటించడం జోరు పెంచిన ఈ అమ్మడు తన భర్త రణ్ వీర్ సింగ్‌తో కలిసి స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తోంది. గతేడాది ఆమె నటించిన ‘ఛపాక్‌’ మంచి విజయం సాధించింది. అందులో యాసిడ్‌ బాధితురాలిగా దీపిక నటన అందర్నీ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌తో కలిసి దీపిక నటించనుంది. వీళ్ల కాంబినేషన్‌లో ‘పఠాన్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూర్తవగానే ప్రభాస్ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే ఈ సొట్టబుగ్గల సుందరి వారికోసం ‘నన్ను అడగండి(Ask Me)’ అనే సెషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇస్తోంది. మేల్కొన్న తర్వాత మీరు చేసే మొదటి పని ఏది అని ఓ ఫ్యాన్ అడిగ్గా.. తాను మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని నా అలారంను ఆపేయడమని తెలిపింది. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం రోజూ వ్యాయమం చేస్తానని చెప్పింది. అలాగే ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలను షేర్ చేసింది. అభిమానులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

మరిన్ని చదవండి :

దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీలో చేరిన మొనగాడు.. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ఏక్ థా టైగర్’ రియల్ స్టోరీ ఇతడిదే..

గాలి సంపత్ రివ్యూ : ఆద్యంతం ఆకట్టుకుంటున్న గాలిసంపత్.. ఫీ..ఫీ..ఫీ భాషతో అదరగొట్టిన నటకిరీటి రాజేంద్రప్రసాద్..