AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ నిలుపుకోవడం సులువే.. కానీ ఆ ప్రయాణమే భయంకరం.. పెళ్లి గురించి కామెంట్స్ చేసిన వెటరన్‌ హీరోయిన్..

Vidya Balan Talk About Marriage : బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ వివాహ బంధం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 2012లో ఆమె ప్రముఖ నిర్మాత సిద్దార్థ్‌ రాయ్‌ను పెళ్లి చేసుకున్న

ప్రేమ నిలుపుకోవడం సులువే.. కానీ ఆ ప్రయాణమే భయంకరం.. పెళ్లి గురించి కామెంట్స్ చేసిన వెటరన్‌ హీరోయిన్..
uppula Raju
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 12, 2021 | 4:09 PM

Share

Vidya Balan Talk About Marriage : బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ వివాహ బంధం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 2012లో ఆమె ప్రముఖ నిర్మాత సిద్దార్థ్‌ రాయ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఎనిమిదేళ్ల బంధం గురించి ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించింది. భార్యభర్తల మధ్య ప్రేమ నిలుపుకోవడం సులువే కానీ ఆ ప్రయాణమే భయంకరమైనదని చెప్పింది.

తమ వైవాహిక బంధం గురించి చెప్తూ వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైన పార్ట్ అని తెలిపింది. ఎవరో ముక్కు, మొహం తెలియని వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే ఎవ్వరికైనా కష్టమే. కానీ చేయాలి వారి అభిరుచులు, అలవాట్లకు తగ్గట్లుగా మారిపోవాలి అదే వివాహ బంధానికున్న గౌరవమంటు తెలిపింది. ‘భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్థలు సాధారణంగా ఉండేవే. కానీ వాటిని మనం విడిచి జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. అలా కాకుండా వాటినే పట్టుకుని ఉంటే మాత్రం భార్యభర్త బంధంలో ఉండే ఆ స్పార్క్‌ పోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే దంపతుల మధ్య గొడవలు జరగడం కూడా మామూలే. కానీ పట్టించుకోకుండా ముందుకువెళ్లాలి. అప్పుడే వైవాహిక బంధం సంతోషంగా, సాఫిగా సాగుతుంది. ఇందుకోసం చేసే ప్రయత్నాలను కూడా నేను ఇష్టపడతానని చెప్పింది. ఈ ఎనిమిదేళ్లలో తాను నేర్చుకున్నది ఇదేనంటూ ప్రస్తావించింది. సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం విద్యా డైరెక్టర్‌ అమిత్‌ మసుర్కర్‌ రూపొందిస్తున్న ‘షేర్నీ’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె మహిళ ఆటవీ అధికారిణిగా కనిపించనున్నారు. విద్యాబాలన్ ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి అవార్డులు గెలుచుకున్న సంగతి అభిమానులకు తెలిసిందే.

మరిన్ని చదవండి :

మీకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోతారు..

స్కూల్‌ లైఫ్‌లో తమన్నా మా సీనియర్.. అయితే ఆమె అందం గురించి బుట్టబొమ్మ ఏం కామెంట్ చేసిందంటే..?

రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..