స్కూల్ లైఫ్‌లో తమన్నా మా సీనియర్.. అయితే ఆమె అందం గురించి బుట్టబొమ్మ ఏం కామెంట్ చేసిందంటే..?
Pooja Hegde Coments: టాలీవుడ్‌లో హీరోయిన్ తమన్నా బాటియా, పూజాహెగ్డే స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందుతున్నారు. ఫేమస్ ప్రాజెక్ట్‌లు చేపట్టి దూసుకుపోతున్నారు. అయితే వాళ్లిద్దరు
Pooja Hegde Coments: టాలీవుడ్‌లో హీరోయిన్ తమన్నా బాటియా, పూజాహెగ్డే స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందుతున్నారు. ఫేమస్ ప్రాజెక్ట్‌లు చేపట్టి దూసుకుపోతున్నారు. అయితే వాళ్లిద్దరు స్కూల్‌మెట్స్ అని ఇటీవల బుట్టబొమ్మ వెల్లడించింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికరమైన సంగతులను వెల్లడించింది. చదువుకునే రోజుల్లో తమన్నా మా సీనియర్ అని పూజాహెగ్డే చెప్పింది. అయితే తాను స్కూల్ లైఫ్‌లో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాదని తెలిపింది. అయితే సంప్రదాయ దుస్తులైనా, పాశ్చాత్త్య దుస్తులైనా తమన్నా ఒదిగిపోయేదని చాలా అందంగా కనిపించేదని చెప్పింది. అంతేకాకుండా తన తోటి స్నేహితులతో , జూనియర్స్‌తో ఇట్టే కలిసిపోయేదని అందరిని తన స్నేహితులుగా మార్చుకునేదని తెలిపింది.
ఇంకా పాఠశాలలో జరిగే ఏ ప్రోగ్రాంలోనైనా ఆమె డ్యాన్స్ చేసేదని వివరించింది. కానీ తాను మాత్రం బిడియంతో మెలిగేదానిని చెప్పుకొచ్చింది. ఎవ్వరితో సరిగ్గా కలవలేకపోయేదానినని పేర్కొంది. అయితే తమన్నాలో అందరితో కలిసిపోయే గుణమే తనను అట్రాక్ట్ చేసిందని అందుకే ఆమె అంటే తనకిష్టమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నటి పూజాహెగ్డే ప్రస్తుతం ‘సర్కస్’‘ఆచార్య’ షూట్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’లో చెర్రీకి జంటగా పూజా కనిపించనున్నారు. మరోవైపు ‘సీటిమార్’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు నటి తమన్నా. దీనితోపాటు ఆమె ‘గుర్తుందా శీతాకాలం’‘ఎఫ్-3’,‘అంధాధున్’ రీమేక్ చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు తమన్నా.
మరిన్ని చదవండి :
రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..