Ola Electric Scooter : సింగిల్ చార్జిపై 240 కిలోమీటర్లు.. త్వరలో ఓలా నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ola Elecric Scooter : ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ మెగా ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో 500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు.
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ మెగా ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో 500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ కొత్త ప్లాంట్‌తో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి కొన్ని ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. రాబోయే రోజుల్లో 10 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ పరిశ్రమ పనిచేస్తుంది. పూర్తిస్థాయి కార్యకలాపాలు 2022 సంవత్సరంలో ప్రారంభమవుతాయి. అయితే అంతకుముందే ఓలా కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను వెల్లడించింది.
ఓలా గత ఏడాది మేలో నేదర్లాండ్ ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత ఈవీ బ్రాండ్ ఎటర్గోను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఓలా కంపెనీ ప్రకటించింది. ఎటర్గో యాప్ స్కూటర్ మొట్టమొదట 2018లో తయారైంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 240 కిలోమీటర్ల ప్రయాణించగలుగుతుంది. ఇప్పుడు, ఇండియా-స్పెక్ మోడల్ ఇలాంటి రేంజ్ లేదా కాస్త తక్కువ రేంజ్ కలిగిన స్కూటర్ ను అందిస్తుందా అనే విషయం సందిగ్ధంలో ఉంది. ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ప్రధాన లక్షణాల విషయానికొస్తే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఏథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ఈ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈయితే ఇవన్నీ రూ1.30లక్షల నుంచి .2 లక్షల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్‌ను రూ .1.25 లక్షలకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రోటోటైప్ ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది.
మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం