Mahashivratri Special-2021: శివరాత్రి వచ్చిందంటే చాలు.. అందరు కందగడ్డ వైపే చూస్తారు.. అసలు శివుడికి – కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
Mahashivratri Special-2021: మహా శివరాత్రి వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కందగడ్డలు కనిపిస్తాయి. శివరాత్రి స్పెషల్ పుడ్ ఏంటి అంటే అందరు కందగడ్డ అని సులువుగా
Mahashivratri Special-2021: మహా శివరాత్రి వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కందగడ్డలు కనిపిస్తాయి. శివరాత్రి స్పెషల్ పుడ్ ఏంటి అంటే అందరు కందగడ్డ అని సులువుగా చెప్పేస్తారు. ఈ దుంపలను తెలంగాణలో కందగడ్డ అని ఆంధ్రాలో చిలగడ దుంప అని పిలుస్తారు. శివరాత్రి రోజు జాగారం చేసే భక్తులు కచ్చితంగా కందగడ్డలను తమ డైట్‌లో చేర్చుకుంటారు. దాని గురించి వారికి తెలిసినా.. తెలియక పోయినా అది జరగుతుంది. అయితే కందగడ్డకు శివరాత్రికి సంబంధం ఏంటో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. దీని గురించి పురాణాల్లో ఓ కల్పిత కథ మాత్రం ఉందని పెద్దలు చెబుతుంటారు.
‘ప్రాచీన రోజుల్లో అడవిలో ఉండే ఆటవిక జాతుల వారు మహాశివరాత్రి రోజున శివుడికి ఆ ప్రాంతంలో దొరికే దుంపలనే నైవేద్యంగా పెట్టేవారు. విచిత్రమేంటంటే ఆ దుంపలు శివరాత్రి పర్వదినం రోజుల్లోనే కనిపించేవట. ఆ దుంపలు మహాదేవుడికి బాగా ఇష్టమైన పుడ్‌గా ఆటవికులు భావించేవారు. అందుకే వాటిని నైవేద్యంగా సమర్పించి శివుడిని ఆరాధించేవారు’ ఆ దుంపలే ఇప్పుడు కందగడ్డలుగా రూపాంతరం చెందినవని అంటారు. అందుకే మహాశివరాత్రి వచ్చిందంటే కందగడ్డలను బాగా విక్రయిస్తారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే కందగడ్డ పంట వేసినప్పడు సరిగ్గా అవి శివరాత్రికి కొంచెం అటు ఇటుగా చేతికొస్తాయి. అందుకే వాటిని మహాశివరాత్రి సందర్భంగా రైతులు మార్కెట్‌లో విక్రయిస్తారు.
అయితే జాగారం చేసేవారికి కందగడ్డ చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వారిని నీరసం నుంచి కాపాడుతూ.. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అందుకే భక్తులు కందగడ్డను ఈ రోజు ఎక్కువగా తీసుకుంటారు. ఇక కందగడ్డలో ఉండే పోషకాల గురించి ఇప్పడు తెలుసుకుందాం. ఉపవాసం చేసే సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువ అవుతుంటాయి. దీనివల్ల స్పృహ తప్పే ప్రమాదం ఉంటుంది. అయితే కందగడ్డలు తినడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా వేగవంతం అవుతుంది. ఇందులోని మినరల్స్, ఐరన్.. శరీరంలోని కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి. కందగడ్డలో బీటా కెరోటిన్, విటమిన్ బీ6, సీ, ఈ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా త్వరగా శక్తి రావడంతో ఉపవాసం చేసే సమయంలో ఇబ్బంది అనిపించదు. కందగడ్డలో విటమిన్ డీ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యమే కాకుండా ఎముకలకు బలం కూడా అందుతుంది.
Shivratri Fasting : మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?