- Telugu News Photo Gallery Science photos American scientists develop method to grow wood in a laboratory
Wood Without a Tree: చెట్టు లేకుండానే కలప.. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తలు.. ఎలా తయారు చేస్తున్నారంటే..
Wood Without a Tree: చెట్టు లేకుండానే కలప.. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తలు.. ఎలా తయారు చేస్తున్నారంటే..
Updated on: Mar 12, 2021 | 3:24 PM

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సూర్యరశ్మి, మట్టి అవసరం లేకుండా ప్రయోగ శాలల్లో ఫర్నిచర్ తయారీ కోసం చెక్కను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కేంబ్రిడ్జి లోని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్న యాష్లే బెక్విత్ నేతృత్వంలోని అధ్యయన బృందం ఈ ప్రయోగాన్ని చేస్తోంది.

‘ప్రయోగశాలల్లో చెక్కను పెంచడం వల్ల కలప అవసరాలకు అడవులపై ఆధారపడడం తగ్గుతుంది’ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఈ శాస్త్రవేత్తలు 3డి ప్రింటెడ్ జెల్ ద్వారా వృక్ష కణాలను నచ్చిన ఆకారంలోకి మలిచి చెక్కను పెంచుతున్నారు.

‘వృక్షాలను పెంచడానికి చాలా వనరులు అవసరం అవసరం అవుతాయి. కానీ, ఒక మొక్కలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. భూమి మీద పూర్తిగా ఆధారపడకుండా ఉత్పత్తులను తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని ఆలోచించాలి’ అని శాస్త్రవేత్తల బృందం అంటోంది.

ఈ విధానాన్ని నిరూపించేందుకు శాస్త్రవేత్తల బృందం జిన్నియా మొక్కను వాడి చిన్నచిన్న నమూనాలను పెంచడం మొదలుపెట్టారు. వీటి పరిమాణాలను నెమ్మదిగా పెంచే ఆలోచన చేస్తున్నారు.

చెట్ల నుంచి వచ్చే చెక్కకు, ప్రయోగశాలల్లో పెంచిన చెక్కకు ఉండే చాలా తేడా ఉటుందట. ‘చెట్టు ఆకారానికి అనుగుణంగా పెరగడం వల్ల సంప్రదాయ తరహా చెక్క ఒక క్రమపద్దతిలో ఉంటుంది. కానీ, ప్రయోగశాలలో పెంచిన చెక్కకి ప్రత్యేక ఆకారం ఉండదు. ఇది ఒక బ్లాక్ లా ఉంటుంది’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.





























