ISRO RH-560 : గాలుల్లో తేడాలు తెలుసుకునేందుకు దూసుకెళ్లిన ఇస్రో ‘ఆర్ హెచ్ 560 సౌండింగ్ రాకెట్’

ISRO RH-560 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఆణిముత్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆర్ హెచ్ 560 అనే సౌండింగ్ రాకెట్..

ISRO RH-560 : గాలుల్లో తేడాలు తెలుసుకునేందుకు దూసుకెళ్లిన ఇస్రో  'ఆర్ హెచ్ 560  సౌండింగ్ రాకెట్'
Isro Rh 560
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 13, 2021 | 12:40 PM

ISRO RH-560 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఆణిముత్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆర్ హెచ్ 560 అనే సౌండింగ్ రాకెట్ ను ప్రయోగించింది. వివిధ ఎత్తుల్లోని తటస్థ గాలుల్లో తేడాలు, ప్లాస్మా గతిశాస్త్ర వివరాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేసినట్టు ఇస్రో ప్రకటించింది. సౌండింగ్ రాకెట్లను అంతరిక్ష పరిశోధనల కోసం పర్యావరణంలోని వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు ప్రయోగించడం సహజం. ఒకటి లేదా రెండు దశల ఘన ఇంధన రాకెట్లివి . వాహక నౌకలు, ఉపగ్రహాల్లో వాడే ఉప వ్యవస్థలు లేదా కొత్త పరికరాల ప్రొటోటైప్ ల పనితీరును తెలుసుకోవడం కోసం టెస్ట్ చేసేందుకు ఈ సౌండింగ్ రాకెట్లను వినియోగిస్తుంటారు.

ప్రస్తుతం ఇస్రో దగ్గర ఇలాంటివి మూడు రకాల సౌండింగ్ రాకెట్లున్నాయి. ఆర్ హెచ్ 200, ఆర్ హెచ్ 300 మార్క్2, ఆర్ హెచ్ 560 మార్క్ 2 రాకెట్లు.. 80 నుంచి 100 కిలోల వరకు పేలోడ్ లను మోసుకుపోగలవు . 80 కిలోమీటర్ల నుంచి 475 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు. 1965లో తొలిసారిగా ఇస్రో సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. వాటిని దేశీయంగానే తయారు చేస్తోంది. పీఎస్ఎల్వీసీ51 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కొన్ని రోజులకే ఇస్రో ఇంకో ప్రయోగాన్ని నిర్వహించడం విశేషం. అయితే, ఆ ప్రయోగానికి ఇది పూర్తి భిన్నం. ఇక్కడా ప్రయోగించింది రాకెట్ అయినప్పటికీ తాజా రాకెట్ ఉపగ్రహాలను మోసుకెళ్లే రకం కాదు.

Read also : AP Bhavan : స్టీల్‌ సిటీ నుంచి హస్తినకు విసర్తించిన ఉక్కు మంటలు, నినాదాలతో హోరెత్తిపోతోన్న ఏపీ భవన్‌