Uninstall Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.!
Uninstall Apps From Phone: మీరు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటున్నారా.? నగదు లావాదేవీలు యాప్స్ ద్వారా చేస్తున్నారా.!..
Uninstall Apps From Phone: మీరు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటున్నారా.? నగదు లావాదేవీలు యాప్స్ ద్వారా చేస్తున్నారా.! అలాగే ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారా.. అయితే తస్మాత్ జాగ్రత్త కొన్ని యాప్స్ మీ ఫోన్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్స్, ఆధార్, పాన్ నెంబర్స్ వంటివి తెలుసుకుని నగదును లూటీ చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని బీజీఆర్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇందులో కొన్ని యాప్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేసింది. ఆ అప్లికేషన్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- బీట్‌ప్లేయర్ (BeatPlayer)
- క్యూర్/బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX)
- కేక్ వీపీఎన్ (Cake VPN)
- మ్యూజిక్ ప్లేయర్ (Music Player)
- పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN)
- ఈవీపీఎన్ (eVPN)
- టూల్‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary)
- క్యూరికార్డర్ (QRecorder)
ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్- ఇన్‌స్టాల్ చేయండి లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్లే.!
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!