AP Bhavan : స్టీల్‌ సిటీ నుంచి హస్తినకు విసర్తించిన ఉక్కు మంటలు, నినాదాలతో హోరెత్తిపోతోన్న ఏపీ భవన్‌

 AP Bhavan : సాగర నగరం విశాఖ వయా తెలంగాణ టు ఢిల్లీ. అవును.. విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. స్టీల్‌ సిటీ నుంచి దేశ రాజధాని హస్తినకు విసర్తించాయి ఉక్కు మంటలు. పెద్ద సంఖ్యలో

AP Bhavan : స్టీల్‌ సిటీ నుంచి హస్తినకు విసర్తించిన ఉక్కు మంటలు, నినాదాలతో హోరెత్తిపోతోన్న ఏపీ భవన్‌
Ap Bhavan
Follow us

|

Updated on: Mar 13, 2021 | 12:12 PM

AP Bhavan : ఉక్కు ఉద్యమం ఉప్పెనలా మారుతోంది. విశాఖలో పోటెత్తిన ఉక్కు ఉద్యమ కెరటాలు ఢిల్లీకి తాకాయి. తమ హక్కులు కాలరాసే హక్కు ఎవరికి లేదంటూ ఉద్యమిస్తున్న ఆందోళకారులు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. విశాఖలో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు… ఇప్పుడు ఢిల్లీకి తాకింది. హైదరాబాద్‌ మీదుగా హస్తినకు పాకిందీ ఉద్యమం. విశాఖ వయా తెలంగాణ టు ఢిల్లీ. YES..విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. స్టీల్‌ సిటీ నుంచి దేశ రాజధాని హస్తినకు విసర్తించాయి ఉక్కు సెగలు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో ఆందోళనలకు దిగారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో హోరెత్తిపోతోంది ఏపీ భవన్‌. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌, గిడుగు రుద్రరాజు సహా కాంగ్రెస్ కీలక నేతలంతా ఆందోళనల్లో పాల్గొన్నారు.

వెంటనే ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని..ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌. రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రత్యేక హోదాతోపాటు ఆంధ్రకు రావలసిన అన్ని అంశాల్లో..తాము ముందుండి పోరాడతామన్నారు. నిన్న హైదరాబాద్‌లో కేటీఆర్‌, చిరంజీవిసహా పలువురు కీలక రాజకీయ, సనీ ప్రముఖులను కలిసి ప్రత్యక్షమద్దతు ఇవ్వాల్సిందిగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు అభ్యర్థించారు. తమ పోరాటానికి సపోర్ట్ చేస్తున్న చిరంజీవికి ఉద్యమకారులు పాలాభిషేకం చేశారు. రెండు రోజల క్రితం కేటీఆర్‌కు కూడా ఇదే విధంగా పాలాభిషేకం చేశారు.

ఉక్కు ఉద్యమానికి టాలీవుడ్‌ నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. చిరంజీవితో ప్రారంభమైన సపోర్ట్‌తో మిగతా స్టార్స్‌ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. వైజాగ్‌లో పర్యటించిన మంచువిష్ణు.. స్టీల్‌ ఉద్యమంపై మాట్లాడారు. ప్రైవేట్‌ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉందని.. అయితే రాజకీయ కారణాల వల్లే వారంతా ముందుకు రాలేకపోతున్నారని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు పవన్ కల్యాణ్‌ ముందుకు రావాలని డిమాండ్ చేశారు మాజీ మంత్ర గంటా శ్రీనివాసరావు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. పవన్‌ నేరుగా పోరాటంలో పాల్గొంటే ప్రభావం ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పార్టీలకతీతంగా.. రాష్ట్రాలకతీతంగా విశాఖ ఉక్కుపై గళం విప్పుతున్నాయి పార్టీలు, ప్రజాసంఘాలు. ఇప్పటికే కార్మికులు జరుపుతున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరాయి. సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ నెల 15 నుంచి రోజుకో రూపంలో నిరసన తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. అవసరమైతే రాజకీయ, సినిమా ప్రముఖులను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Read also : Trump Buddha Statues: అధ్యక్ష పదవి పోయినా చైనాలో ట్రంప్.. ట్రంపే.. కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తోన్న డ్రాగన్ కంట్రీ