Gongura Roti Pachadi : నోరూరించే ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గోంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో...

Gongura Roti Pachadi :  నోరూరించే ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!
Gongura Pacchadi
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2021 | 9:06 PM

Gongura Roti Pachadi : వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గోంగూర ఉంటే మాత్రం పుల్లగా… పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు. గోంగూర పప్పు, గోంగూర పులుసులు, గోగూర రొయ్యలు, గోంగూర మటన్ వంటి అనేక రుచికరమైన వంటలు చేస్తారు. ఇక గోంగూర ను నిల్వ పచ్చడి కూడా పెడాతారు.. ఇక అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే.. మరి ఈరోజు ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

కావాల్సిన పదార్ధాలు :

గోంగూర కట్టలు -2 పెద్ద సైజు నూనె చింతపండు ఉప్పు కారం వెల్లులి జీలకర్ర మెంతి పొడి

పోపుకు కావాల్సిన పదార్ధాలు :

కర్వేపాకు రెండు రెమ్మలు ఎండు మిర్చి 5 వెల్లుల్లి ఇంగువ

తయారీ విధానం :

గోంగూర కాడల నుంచి ఆకు కోసి శుభ్రంగా కడిగి బట్ట మీద ఆర బెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేసి గోంగూర ఆకుని వేసి మగ్గ నివ్వాలి. రోటిలో పది వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కొద్దిగా మెంతి పిండి, పులుపుకి సరి పడా కారం, కొద్దిగా చింత పండు, ఉప్పు, వేసి రోటి లో దంచి తర్వాత మగ్గిన గోంగూర కూడ వేసి కొంచెం ఆకులు వుండే లా నూరు కోవాలి. అనంతరం ఈ పచ్చడికి ఇంగువతో తాలింపు పెడితే కమ్మటి గోంగూర పచ్చడి రెడీ. ఏ పచ్చడిని అన్నంలోను ఇడ్లీలోను వేసుకోవచుకోవచ్చు.

Also Read:

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో గుర్తుపట్టగలరా..!

బావద్వేగంతో పవన్ కళ్యాణ్ మాటలు…బీజేపీ తో పొత్తుపై అయన డైలాగ్స్ వింటే అదే అనుమానం: