South Indian Heroine : అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో గుర్తుపట్టగలరా..!
కొంతమంది మరణించే చిరంజీవులు.. ముఖ్యంగా కళాకారులు మరణించీ చిరంజీవులు. చిన్నవయసులో ఎంతో భవిష్యత్ ఉంది అనుకున్న సమయంలో అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్ళిపోతారు.. వారు భౌతికంగా...
South Indian Heroine : కొంతమంది మరణించే చిరంజీవులు.. ముఖ్యంగా కళాకారులు మరణించీ చిరంజీవులు. చిన్నవయసులో ఎంతో భవిష్యత్ ఉంది అనుకున్న సమయంలో అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్ళిపోతారు.. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ సినిమాలతో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు. అలరిస్తూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో ఒకరు పైన కనిపిస్తున్న చిన్నారి.
డాక్టర్ చదవాల్సిన ఓ అమ్మాయి అనుకోకుండా వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాను నటించిన సినిమాలతో పాత్రలతో హోమ్లీ హీరోయిన్ గా మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. అనుకోకుండా ఓ విమానా ప్రమాదంలో కేవలం 32 ఏళ్లకే ఆమె మరణించి ఎన్నేళ్లుగడిచినా ప్రేక్షకుల మనసులో స్థానం అలానే ఉండి పోయింది. అభినవ సావిత్రగా పేరు పొందిన ఆ నటి ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా.. అవును ఆమె సౌందర్య.
సౌందర్య తండ్రి జ్యోతిష్కులు.. చిన్నతనంలోనే తన కూతురు పెద్ద నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందని .. అయితే పెళ్లి తర్వాత సౌందర్యకు ఓ పెద్ద ప్రమాదం జరుగుతుందని ముందే సౌందర్య తండ్రికి తెలుసు అనేది ఇప్పటికీ కన్నడం లో ఓ టాక్. తెలుగులో సౌందర్య మనవరాలి పెళ్లి సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. రాంజేంద్రు, గజేంద్రుడు సినిమాతో హిట్ అందుకోవడమే కాదు.. కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అమ్మోరు, పెదరాయుడు . నరసింహ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి డిఫరెంట్ నేపధ్య కథలతో సౌందర్య తన నటనతో ఆకట్టుకుంది.
గ్లామర్ హీరోయిన్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా కట్టుబొట్టు నిండైన దుస్తులతో స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినీ రంగాన్ని ఏలింది సౌందర్య. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఓ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకానికి చేరుకుంది. అయినప్పటికి తాను నటించిన సినిమాలతో ధ్రువతారగా వెలుగుతోంది.
Also Read :