Baking Soda Benefits : ఆరోగ్యానికి చక్కటి చౌకైన నేస్తం .. బేకింగ్ సోడా.. దీనివలన ఎన్ని లాభాలో తెలుసా..!
సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. దీనిని మనం వాడుఁక భాషలో బేకింగ్ సోడా అంటాం. దీనిని ఇంట్లో చేసే వంటల కంటే బేకరీ ఉత్పత్తుల్లోనే ఎక్కువగా వాడుతుంటారు. వంట సోడాని కొన్ని ఆహార పదార్ధాల...
Baking Soda Benefits : సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. దీనిని మనం వాడుఁక భాషలో బేకింగ్ సోడా అంటాం. దీనిని ఇంట్లో చేసే వంటల కంటే బేకరీ ఉత్పత్తుల్లోనే ఎక్కువగా వాడుతుంటారు. వంట సోడాని కొన్ని ఆహార పదార్ధాల తయారీలో గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తారు. పలు స్వీట్స్, కేకుల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ బేకింగ్ పౌడర్ కేవలం వంటలకే కాదు, పలు అనారోగ్య సమస్యల్ని కూడా నివారిస్తుందంటున్నారు ఆహార నిపుణులు.
* ఒక స్పూన్ బేకింగ్ సోడాను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నివారణకు కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కలిపి తాగితే కడుపులో గ్యాస్ తగ్గి పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది.
* రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి దానికి తగినంత నిమ్మరసం చేర్చి పరగడుపున తాగాలి. అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా కొంత కాలం చేస్తే శరీరంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది.
* కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఈ పౌడర్‌కి వుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ విధంగా రోజూ తాగుతున్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. అంతే కాకుండా పాదాల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
*ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి.
* శరీరం పై ఏదైనా పురుగు పాకినా, లేదా కుట్టినా ఆ ప్రాంతంలో దురద, నొప్పి, మంట వంటివి వుంటాయి. దీన్ని తొలగించుకోవడానికి కూడా బేకింగ్ పౌడర్ పని చేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి. నిదానంగా నొప్పి, మంట అన్నీ తగ్గుముఖం పడతాయి.
* కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి వారినుంచి దుర్వాసన వస్తుంటుంది. బేకింగ్, నీళ్లు కలిపిన మిశ్రమంలో కాటన్ బాల్ వుంచి చెమట ఎక్కువగా పట్టే ప్రాంతంలో అప్లై చేస్తే దుర్వాసన దూరమవుతుంది.
* స్నానం చేసే నీళ్లలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
* అంతే కాకుండా ఈ మిశ్రమం మంచి హాడ్ వాష్‌గా కూడా పనిచేస్తుంది. చేతుల మురికిని తొలగించి చక్కగా శుభ్రపడతాయి.
Also Read :