IPPB New Charges : పోస్టల్ ఖాతాదారులకు షాక్ .. నగదు వేసినా .. తీసినా బాదుడే.. ఎప్పటి నుంచి అంటే..!
ఇప్పటి వరకూ బ్యాంక్ లు మాత్రమే తన ఖాతాదారులకు వేసినా తీసినా డబ్బులు వసూలు చేస్తూ షాక్ ఇచ్చాయి. అయితే తాజాగా అదే బాటలో నడవడానికి పోస్ట్ ఆఫీస్ కూడా రెడీ అవుతుంది. అవును పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉన్న...
IPPB New Charges : ఇప్పటి వరకూ బ్యాంక్ లు మాత్రమే తన ఖాతాదారులకు వేసినా తీసినా డబ్బులు వసూలు చేస్తూ షాక్ ఇచ్చాయి. అయితే తాజాగా అదే బాటలో నడవడానికి పోస్ట్ ఆఫీస్ కూడా రెడీ అవుతుంది. అవును పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉన్న వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. తమ కస్టమర్స్ కు పోస్ట్ ఆఫీస్ షాక్ ఇచ్చింది. డబ్బులు డిపాజిట్ చేయాలన్నా… విత్ డ్రా చేయాలన్నా ఇక నుంచి చార్జీలు విధించనున్నామని పోస్ట్ ఆఫీస్ తెలిపింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..
పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉన్న వినియోగదారులు తమ నగదును నెలకు నాలుగు సార్లు డ్రా చేసుకుంటే ఏ విధమైన చార్జీలు ఉండవు.. అయితే అంతకంటే ఎక్కువ సార్లు విత్ డ్రా చేసుకుంటే మాత్రం ప్రతి ట్రాన్సక్షన్ కు రూ. 25 చార్జీలను వసూలు చేయనున్నామని పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు.
సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉన్న వినియోగదారులు ప్రతి నెలా రూ. 25,000 వరకూ ఫ్రీగా నగదును తీసుకోవచ్చు.. ఇక వీరు నెలకు రూ. 10వేల వరకూ ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ పరిమితి దాటి వినియోగదారుడు చేసే లావాదేవీలకు అదనపు చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పోస్టాఫీస్ లో మినీ స్టేట్ మెంట్ కోరే వినియోగదారులు రూ. 5వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఐతే పోస్టు పేమెంట్ నెట్‌వర్క్ లో ట్రాన్సాక్షన్లను పూర్తి ఉచితంగా నిర్వహించుకునే వీలు కల్పించింది.
మరో వైపు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్లలో విత్ డ్రా లిమిట్ ను పెంచింది. దీంతో సేవింగ్స్ అకౌంట్ కస్టమర్స్ ఇప్పటి వరకూ కేవలం రూ. 5000 మాత్రమే విత్ డ్రా చేసుకునేవారు.. అయితే తాజాగా నిర్ణయం తో రూ. 20 వేల వరకూ ఇప్పుడు విత్ డ్రా చేసుకునే వీలుంది. ఈ నిర్ణయంతో తమ సేవింగ్ ఖాతాదారులను పెంచుకోవచ్చని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు.
ఇక ఒకే రోజులో ఒక ఖాతా నుంచి రూ. 50వేల కంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలను నిర్వహించలేరు అంతేకాదు పోస్టల్ లో సేవింగ్స్ ఖాతా గలిగిన వినియోగదారులు మినిమమ్ అమౌంట్ రూ. 500 లను కచ్చితంగా మెయిన్ టెయిన్ చేయాలి.. లేదంటే వంద రూపాయలు ఫైన్ పడుతుందని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.
Also Read: