Yoga Pose Halasana : మీ దాంపత్య జీవితం శృంగార భరితం కావాలంటే ఈ ఆసనం వేయండి.. అయితే కండిషన్స్ అప్లై

మానసిక ఒత్తిడి ని తగ్గించుకోవడానికి శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎంతో ప్రయోజనకారి. ఇక యోగాలో ఒకరకమైన ఆసనం హలాసనం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆసనం ఎలా వేయాలి.. ఏ విధమైన ప్రయోజనాలున్నాయి..

Yoga Pose Halasana : మీ దాంపత్య జీవితం శృంగార భరితం కావాలంటే ఈ ఆసనం వేయండి.. అయితే కండిషన్స్ అప్లై
Halasana
Follow us

|

Updated on: Mar 14, 2021 | 5:54 PM

Yoga Pose Halasana : మానసిక ఒత్తిడి ని తగ్గించుకోవడానికి శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎంతో ప్రయోజనకారి. ఇక యోగాలో ఒకరకమైన ఆసనం హలాసనం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆసనం ఎలా వేయాలి.. ఏ విధమైన ప్రయోజనాలున్నాయి.. ఎవరు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి చూద్దాం..!

హలాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. నాగలి రూపంలో ఉంటుంది కనుక ఈ ఆసనాన్ని హలాసనమంటారు. ఈ ఆసనం వేయు సమయంలో సెర్వికల్ వెన్నెముకపై గణనీయమైన ఒత్తిడి ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో ఈ భాగంపై ఈ రకమైన ఒత్తిడి ఉండదు. కనుక ఈ ఆసనం వేయునప్పుడు సరైన పద్దతులను అనుసరించాలి. లేదంటే గాయం అయ్యే ఛాన్స్ ఉంది.

హలాసనం వేయాలనుకునేవారు విపరీత కర్ణిక మరియు సర్వాంగాసనాలను వేయటంలో నిష్ణాతులై ఉండాలి. ఈ హలాసనం దాదాపు పశ్చిమోత్తాసనానికి దగ్గరగా ఉంటుంది.

హలాసనం వేయు పద్ధతి:

మొదట శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి. ఈ స్థితిలో మీ వక్షస్థలం గడ్డానికి తగలాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును. అయితే చేతులపై ఎటువంటి ఒత్తిడిని పెట్టకండి

ప్రయోజనం

హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది. వెన్నెముక మృదువుగా ఉంటుంది. మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది. నడుము సన్నబడుతుంది. బాణపొట్ట తగ్గుతుంది. ఈ ఆసనం కూడా సెక్స్ సామర్థ్యం పెరగడానికి దోహదం చేస్తుంది. .

గమనిక

హలాసనాన్ని గర్భిణీ స్త్రీలు వేయరాదు. ఆసనం వేస్తున్న సమయంలో ఉదర భాగంలో నొప్పి అనిపిస్తే వెంటనే ఆపివేయడం మంచిది. అధిక రక్తపోటు గలవారు, గుండెజబ్బులు, వరిబీజం, అల్సర్, స్పాండిలోసిన్ వున్నవారు హలాసనం వేయకూడదు.

Also Read:

‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం’’

యూనివర్సిటీలో ఏంటి ఈ పిచ్చి పనులు… ఇరువురిపై బహిష్కరణ వేటు

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు