బుర్ఖా తీవ్రవాదానికి నిదర్శనం, దీన్నిత్వరలో నిషేధిస్తాం, శ్రీలంక మంత్రి ప్రకటన

ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాను  త్వరలో నిషేధిస్తామని శ్రీలంక మంత్రి ఒకరు ప్రకటించారు. బుర్ఖా అన్నది తీవ్రవాదానికి నిదర్శనమని, దీని బ్యాన్ కు సంబంధించిన  ఓ పత్రంపై తాను సంతకం చేశానని,

బుర్ఖా తీవ్రవాదానికి నిదర్శనం, దీన్నిత్వరలో  నిషేధిస్తాం, శ్రీలంక మంత్రి ప్రకటన
burqa sign of extremism says sri lanka minister
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 13, 2021 | 7:57 PM

ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాను  త్వరలో నిషేధిస్తామని శ్రీలంక మంత్రి ఒకరు ప్రకటించారు. బుర్ఖా అన్నది తీవ్రవాదానికి నిదర్శనమని, దీని బ్యాన్ కు సంబంధించిన  ఓ పత్రంపై తాను సంతకం చేశానని, దీన్ని కేబినెట్ ముందు ఉంచుతానని  శరత్ వీరశేఖర అనే ఈ మంత్రి వెల్లడించారు. బుర్ఖాను తప్పకుండా నిషేధిస్తామన్నారు. కొంతమంది ముస్లిం మహిళలు తమ మొత్తం ముఖం కవర్ అయ్యేలా బుర్ఖా ధరిస్తున్నారని, కానీ  జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇక  దీని బ్యాన్ విషయంలో నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోదం పొందేలా చూస్తానని ఆయన చెప్పారు. ఇదివరకు దేశంలో ముస్లిం మహిళలు, యువతులు  దీన్ని ధరించేవారు కారని, అయితే ఇటీవలి కాలంలో మళ్ళీ ఈ వైఖరి  పెరిగిందని శరత్ వీరశేఖర పేర్కొన్నారు. 2019 లో ఇస్లామిక్ మిలిటెంట్లు కొలంబోలోని కొన్ని చర్చీలు, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడడంతో సుమారు 250 మందికి పైగా ప్రాణాలు  కోల్పోయారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం తాత్కాలికంగా  బుర్ఖాను బ్యాన్ చేసింది.

ఇక ఆ సంవత్సరాంతంలో ప్పటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నగొటబాయ రాజపక్ష..  తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. ఆ తరువాత ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కాగా-దేశంలో వెయ్యికి పైగా ఉన్నమదర్సా ఇస్లామిక్ స్కూళ్లను కూడా మూసివేసే యోచన ఉందని మంత్రి శరత్ వీర శేఖర వెల్లడించారు. ఇవి జాతీయ విద్యా విధాన పాలసీని అతిక్రమిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పిల్లలకు తమ ఇష్టం వచ్చేలా బోధనలు ఎవరూ చేయజాలరన్నారు. శ్రీలంకలో బౌద్దులు ఎక్కువ  సంఖ్యలో ఉన్నారు.  మసీదుల్లో..ఎక్కడ బడితే అక్కడ  ముస్లింలు జంతు బలులు చేస్తున్నారని, వీటిని తాము సహించబోమని వీరంటున్నారు. కాగా-   పైగా  కోవిడ్ మృతుల అంత్యక్రియల విషయంలో కూడా ప్రభుత్వానికి, ముస్లిములకు మధ్య తీవ్ర భేదాబిప్రాయాలు ఉన్నాయి. ఈ వైరస్ కి గురై మరణించిన తమ వర్గీయులను దహనం చేయరాదని ముస్లింలు అంటుండగా దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!