AP Municipal Elections: ‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం’’
AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనం అని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా తమ పార్టీదే హవా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభిపై ఆ పార్టీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లు సైతం వైసీపీ కైవసం చేసుకోవడం ద్వారా పరిపాలన రాజధాని తరలింపుని ప్రజలందరూ ఆమోదిస్తున్నారని స్పష్టమైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఫలితాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు, ఆయన అనుసరిస్తున్న విధి విధానాలకు నిరద్శనం అని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఓ నాలుగు వార్డుల్లో ప్రైవేటీకరణ ప్రభావం కనిపించినట్లుగా తెలుస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇదిలాఉంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లతో కలిసి విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల తీరును పరిశీలించారు. విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ గెలుచుకోవడంతో నేతలంతా సంబరాలు చేసుకున్నారు.
విశాఖలో వైసీపీ విజయయాత్రం..
ఇదిలాఉంటే.. విశాఖ కార్పొరేన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్‌లో మొత్తం 98 డివిజన్లు ఉండగా.. అందులో వైసీపీ 58 డివిజన్లను గెలుచుకుంది. ఇక టీడీపీ 30, జనసేన 3, బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1, ఇతరులు 4 స్థానాలు దక్కించుకున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాలో ఉన్న మున్సిపాలీటీల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసింది. యలమంచిలి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. యలమంచిలిలో 25 వార్డులు ఉండగా.. వాటిలో వైసీపీ 23, టీడీపీ 1, ఇతరులు 1 చొప్పున గెలుచుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో సైతం వైసీపీ జెండా పాతింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులుండగా.. వైసీపీ 14 వార్డులను గెలుచుకుంది. టీడీపీ 12, ఇతరులు 2 చొప్పున వార్డుల్లో గెలుపొందారు.
Also read: AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా
Lahore university proposal: యూనివర్సిటీలో ఏంటి ఈ పిచ్చి పనులు… ఇరువురిపై బహిష్కరణ వేటు