AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown in Pakistan : పాకిస్థాన్ లో మళ్ళీ కరోనా కల్లోలం… రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం..

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కోవిడ్ తీవ్రత ఎక్కడా అదుపులోకి రావడం, లేదు.. అగ్ర రాజ్యాల నుంచి పేద దేశాల వరకూ కరోనా నివారణ...

Lockdown in Pakistan : పాకిస్థాన్ లో మళ్ళీ కరోనా కల్లోలం... రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం..
Lock Down In Pakisthan
Surya Kala
|

Updated on: Mar 14, 2021 | 5:29 PM

Share

Lockdown in Pakistan : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కోవిడ్ తీవ్రత ఎక్కడా అదుపులోకి రావడం, లేదు.. అగ్ర రాజ్యాల నుంచి పేద దేశాల వరకూ కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ ఇస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో కరోనా వివిధ రూపాలను సంతరించుకుని ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. మరోసారి కరోనా మహమ్మారి కోరలు చాచుతుంది,

దీంతో తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ పంజాబ్ లోని ప్రావిన్స్ లోని ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో పూర్తి స్థాయికో లాక్ డౌన్ పాటించాలని ప్రజలకు ఈ మేరకు ప్రభుత్వానికి సహకరించాలని ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్‌సిఓసి) పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. ఇక లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం మరియు అవసరమైన వస్తువులతో పాటు బేకరీ వంటి దుకాణాలు రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి మాత్రమే ఇంటిని విడిచి వెళ్ళడానికి అనుమతించారు.

పాక్ లో కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత 2020 మార్చి లో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా వ్యాప్తి భారీగా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విమానాలపై విధించిన ఆంక్షలను పరిమితులను మళ్ళీ మార్చి 18 వ తేదీ వరకూ పొడిగించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటన రిలీజ్ చేసింది. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదకాగా.. ఇప్పటి వరకూ మొత్తం 13, 476 మంది మరణించారని తెలుస్తోంది. ఇక వ్యాక్సిన్ కోసం ఓ వైపు చైనా ను పాక్ ప్రభుత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read:

అక్కడ స్వామివారికి ప్రతి రోజూ వివాహం.. ఆ స్వామిని దర్శించుకునేవారికి వెంటనే కళ్యాణయోగం

 : పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్