Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SriVeereswara Swamy : అక్కడ స్వామివారికి ప్రతి రోజూ వివాహం.. ఆ స్వామిని దర్శించుకునేవారికి వెంటనే కళ్యాణయోగం

తూర్పుగోదావరి జిల్లా గౌతమీ తీర గ్రామమైన మురముళ్ళలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారట. అందుకనే ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చిందని కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి. ఈ గ్రామంలో ఉన్న శైవ క్షేత్రం ఓ చారిత్రక ప్రదేశం. ఇక్కడే వీరభద్రుడికి, భద్రకాళికి గాంధర్వ పద్దతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకున్నవారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం..

Surya Kala

|

Updated on: Mar 14, 2021 | 5:41 PM

వృద్ధగౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. వీరభద్రు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకొంటారు.

1 / 6
స్వామివారికి దాదాపు మూడు గంటల పాటు వివాహమహోత్సవం జరుగుతుంది. దీనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కల్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం. శివరాత్రి మహోత్సవం సమయంలో మురమళ్ల వీరేశ్వరస్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కీర్తించబడుతుంది.  రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు సుమారు నెల రోజులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం, వసతి సౌకర్యం ఉంది. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

2 / 6
 పురాణాల కథ ప్రకారం దక్షుడు అనే రాజు ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తాడు.. ఈ యాగానికి సొంతకూతురు దాక్షాయణిని అల్లుడు శివుడిని ఆహ్వానించడు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న దాక్ష్యాయణి భర్త ఎంత వారిస్తున్నా వినకుండా పుట్టింటి మమకారంపై యాగశాల వద్దకు చేరుకుంది. అయితే అక్కడ తీవ్రంగా అవమానింపబడుతుంది. దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది  దాక్షాయణి. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించి దక్ష యజ్ఞం నాశనం చేయమని పంపిస్తాడు.

3 / 6
  దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి చేయించాడు. అయినప్పటికీ వీరభద్రుడు శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు, విష్ణుమూర్తిని వీరేశ్వరుడి శాంతింపచేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి  శాంతింపజేయడాని ప్రయత్నించి విఫలమవుతాడు. త్రిమూర్తులతో కూడి దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు.  జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళిని వీరభద్రుని శాంతింప చేయడానికి పంపిస్తుంది.

4 / 6
  అపుడు భద్రకాళి అమ్మవారు మురమళ్ల దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన  కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కన్పిస్తుంది. దీంతో వీరభద్రుడు శాంతించాడు. వెంటనే అక్కడ ఉన్న దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన వివాహం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తే త్వరలో ఫలితం కనబడుతుందని చెబుతారు.అలా భక్తులు జరిపించే వివాహం నిత్యం జరుగుతూ ఉంటాయి

5 / 6
కాలక్రమములో ఈ ప్రాంతంలో వరదలు సంభవించడం.. ఇతర ప్రకృతి వైపరీత్యాలతో ఆలయం గోదావరినదిలోకి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత ఓ భక్తుడి కలలో కనిపించిన స్వామి తనకు ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారట. స్వామివారి మహాలింగమును చేతులపై తీసుకోస్తుండా మురమళ్ళలోని ఒక 'పవిత్ర స్థలము చేరేసరికి ఆ దివ్యలింగము భారం పెరిగి అది స్వామివారి ఆజ్ఞగాభావించి అక్కడే మహా లింగం ఉంచి .. అక్కడే సా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టారని స్థల పురాణంద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ  పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణము స్వామివారికి జరుగుతూనే ఉన్నాయి.

6 / 6
Follow us