- Telugu News Photo Gallery World photos Most powerful passports 2021 list revealed japan in first place singapore in 2nd india ranks 85
Powerful Passports : మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్స్.. తొలి రెండు స్థానాల్లో జపాన్, సింగపూర్. ఇండియా వాల్యూ ఎంతంటే?
Powerful Passports 2021 list : చేతిలో పాస్ పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు ఏదేశమైనా వెళ్లిరావచ్చు అనుకుంటే కుదరదు కదా, వీసా కూడా తప్పనిసరి.
Updated on: Mar 14, 2021 | 6:38 PM

అయితే, వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లిపోయి.. అరైవల్ వీసాను పొందే సౌలభ్యం ఆయా దేశాల సామర్థ్యాల్ని బట్టి, ఆయా దేశాల పాస్ పోర్ట్ లకు పవర్ ఉంటుంది.

ఇదే తరహాలో ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఏ దేశానిదన్న క్వశ్చన్ వేస్తే.. తాజాగా 2021 జాబితా విడుదలైంది. దీని ప్రకారం.. జపాన్ పాస్ పోర్ట్ చేతిలో ఉంటే.. ప్రపంచంలో ఏకంగా 191 దేశాలకు ఎలాంటి వీసా ప్రాసెస్ లు లేకుండా వెళ్లిపోయే వీలుంటుంది.

నెంబర్ టూ స్థానంలో సింగపూర్ పాస్ పోర్ట్ నిలిచింది. ఇది చేతిలో ఉంటే 190 దేశాలకు తిరిగిరావొచ్చు.

3. జర్మనీ, దక్షిణ కొరియా: 189 దేశాలకు వెళ్లొచ్చు

4. ఇటలీ, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్: 188 దేశాలకు వెళ్లొచ్చు

5. ఆస్ట్రియా, డెన్మార్క్: 187 దేశాలకు వెళ్లొచ్చు

6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్: 186 దేశాలకు వెళ్లొచ్చు

7. యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, : 185 దేశాలకు వెళ్లొచ్చు

8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా: 184 దేశాలకు వెళ్లొచ్చు

9. కెనడా: 183 దేశాలకు వెళ్లొచ్చు

10. హంగరీ: 182 దేశాలకు వెళ్లొచ్చు

భారతదేశం విషయానికే వస్తే.. ఇండియా పాస్ పోర్ట్ చేతిలో పట్టుకొని విమానం టికెట్ కొనేసి రివ్వున ఎగిరే సౌలభ్యం కేవలం 59 దేశాలకు మాత్రమే వెళ్లొచ్చు.





























