Balanced Diet : తినే ఆహారంలో విషయంలో కొన్ని పద్ధతులు పాటిస్తే.. మంచి ఆరోగ్యం మీ సొంతం అంటున్న వైద్యనిపుణులు
మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే... మనం ఎం తింటున్నాం, ఎలాంటి ఆహారం తింటున్నాం అనే విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై...
Balanced Diet : మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే… మనం ఎం తింటున్నాం, ఎలాంటి ఆహారం తింటున్నాం అనే విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అందుకనే పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అంటే నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అదే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటున్నారు. మరి పౌషికారాహారానికి కొన్ని చిట్కాలు చూద్దాం ..!
1* మంచి ఆరోగ్యంగా ఉండాలనే మన శరీరానికి అన్నిరకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు.. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు, వంటివి ఉండాలి.. అదే మాంసాహారులైతే.. మాంసకృతులు ఉండే చేపలు, చికెన్ వంటివి ఆహారం లో భాగంగా చేర్చుకోవాలి.
2* ఇక ఎక్కువగా పండ్లు. కూరగాయలు తీసుకోవడం అత్యుత్తమం.
3* శారీరక బరువు స్త్రీ పురుషులకు వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. బరువు వయసు, హైట్ బట్టి నిర్ణయిస్తారు. అధిక బరువు కలవారు ఐతే పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం తదితర వ్యాధులు సోకె అవకాశం ఉంది. అయితే తగినంత బరువు లేకపోయినా పలు ఆరోగ్య సమస్యలు రావచ్చు.. ఎముకల సమస్యలు, బుుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంది. కనుక మనం ఎంత బరువు ఉండాలి అనే విషయం పై వైద్యుల సలహాలు తీసుకుని ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
4* కొంతమంది తమకు నచ్చిన ఆహారాన్ని అధికంగా.. తీసుకుంటారు.. నచ్చని ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నా తినడానికి ఇష్టపడరు.. అటువంటి వారు తక్షణమే అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
5* తినడానికి సమయం ఉంటుంది. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం, రాత్రి తినే భోజనం వరకూ నిర్ణీత సమయంలో తినాల్సి ఉంటుంది. భోజనానికీ భోజనానికి నడుమ అల్పాహారం మంచిదే . అయినప్పటికీ అల్పాహారాన్ని అధికంగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
6* కొని ఆహారపదార్ధాలను పౌష్టిక విలువలతో పాటు.. రుచి కోసం తింటాం.. ఇక నచ్చిన ఆహారపదార్ధాల్లో కొవ్వు, ఉప్పు, తీపి ఎక్కువ ఉన్నా వాటిని కొంతమంది పూర్తిగా వదిలివేస్తారు. ఐతే వాటిని పూర్తి స్థాయిలో వదిలివేయమని వైద్యులు సూచిస్తే గానీ మానెయ్యకూడదు.. తక్కువ మొత్తంలోనైనా వాటిని శరీరానికి అందించాలి.
7* రోజు మనం తినే ఆహారంలో సమతుల్యం లోపిస్తే.. మర్నాడు వాటిని శరీరానికి అందించే విధంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి.
8* మనం రోజు తినే ఆహారపు అలవాట్లను ముందుగా గుర్తించి.. అప్పుడు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అన్ని పోషకాలు అందుకుంటున్నాయో లేదో గుర్తించవచ్చు.. అందుకు ముందుగా మూడు రోజుల పాటు మనం రోజూ ఏమేమి తింటున్నామో లిస్ట్ రాసుకుంటే.. అప్పుడు వాటిల్లో క్రొవ్వు పదార్థాలూ, మాంస కృత్తులూ, పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నామో తెలుసుస్తుంది. అప్పుడు మనం రోజూ తినే ఆహార పదార్ధాల లిస్ట్ నుంచి తొలగించాలి. వాటి ప్లేస్ లో పండ్లు, తృణధాన్యాలు కూరగాయాలను చేర్చుకోవాలి.
9* ఎవరికైనా ఒక్కసారే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే.. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమత్యుల్యం ఉండేలా అన్ని పదార్ధాలను చేర్చుకోవాలి.
10* చివరిగా ఏ ఆహారపదార్ధం పూర్తిగా మంచిది కాదు.. అదే విధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు.. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకుని మనం రోజూ తినే డైట్ ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనలని మనం కాపాడుకున్నట్లే ..
Also Read: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం
అవార్డుల పండగ వేడుకలో నిరసన గళం.. బట్టలు విప్పేసిన ఉత్తమ నటి..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!