Telangana Budget Highlights: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్‌ తమిళిసై ‌

|

Updated on: Mar 15, 2021 | 2:03 PM

Telangana Budget session updates: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సభలో ప్రసంగిస్తున్నారు.

Telangana Budget Highlights: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్‌ తమిళిసై ‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సభలో ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా, తదితర అంశాలపై చర్చించి, ఆ నిర్ణయాలను ఫైనల్ చేస్తారు.

18వ తేదీన బడ్జెట్..

తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడుతాయి. ఇక మరుసటి రోజు అంటే 16వ తేదీన సమావేశాల్లో దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాపం తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. 17వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపుతూ సభలో సభ్యులు ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా పలు అంశాలపై ముక్తసరిగా చర్చ జరుపుతారు. ఈనెల 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతారు. సరిగ్గా 11.30 గంటలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దానికి ముందు బడ్జెట్ ప్రతులను ఉభయ సభల సభ్యులకు అందజేస్తారు. బడ్జెట్ ప్రసంగం అయిపోయాక సభను వాయిదా వేస్తారు. బడ్జెట్ అధ్యయనం కోసం 19న సభకు సెలవు ఉంటుంది. ఇక 20వ తేదీ నుంచి సమావేశాలు యధావిధిగా మొదలవుతాయి.

దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంధ్యం, కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకురి రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌కు తుది రూపమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రెవెన్యూ రాబడులతో పాటు ఖర్చులు కూడా పెరగనున్నాయి. పీఆర్సీ ప్రకటన, అన్ని రకాల ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై ఇర్ణయిం తీసుకునే అవకాశం ఉండటంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరగనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు – గవర్నర్

ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై సౌందర్య రాజన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలను రూపొంచారని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అన్ని వర్గాల ప్రజల పురోగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అపోహాలు సృష్టించారని గరవ్నర్‌ అన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని, ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ అన్నారు.

తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం లభించింది. దేశానికే ఈ కార్యక్రమం ఎంతో ఆదర్శంగా నిలిచింది. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెడుతున్నాము అని గవర్నర్ అన్నారు. అలాగే ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో ఉందని, 67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. అలాగే విద్యుత్‌ రంగంలో ఎన్నో విజయాలను సాధించామని, అతి తక్కువ సమయంలోనే సమస్యల నుంచి గట్టెక్కి..  రైతులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని  గవర్నర్‌ పేర్కొన్నారు.

త్వరలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి

అలాగే త్వరలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కానుందని, డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తున్నామని అన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేల రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. 2.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాము. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్ర ముందుకు వెళ్తోందని, ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని, కొత్త మున్సిపల్‌ , రెవెన్యూ చట్టంతో పాలనలో సమూలమైన మార్పులు జరగనున్నాయని అన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామన్నరు. గతంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టబడి ఉంది. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన గవర్నర్ వెల్లడించారు.

భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం రావడం గర్వకారణం

అలాగే మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని, అన్ని మతలాలకు సమాన ఆదరణ, న్యాయం లభిస్తోందని అన్నారు. ఔషధ నగరిగా హైదరాబాద్‌కు ఖ్యాతి లభించిందని, గ్రేటర్‌ నుంచే ఎన్నో టీకాలు, మందులను ఉత్పత్తి జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని గవర్నర్‌ వివరించారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం రావడం గర్వకారణం. ఫార్మా రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే ఫార్మా సిటీ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి కరోనా టీకా అందించాం. వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Mar 2021 12:28 PM (IST)

    ఆధునాత పద్దతుల ద్వారా సైబర్‌ నేరాలను నివారిస్తున్నాం

    ఆధునాతన పద్దతుల ద్వారా సైబర్‌ నేరాలను నివారిస్తున్నాము. సైబర్‌ నేరాల నియంత్రణకు పీఎస్‌లలో ప్రత్యేకంగా సైబర్‌ వారియర్లను నియమించాం. అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మించాము. రాష్ట్రంలో 6.65 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 68 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి. సీసీ కెమెరాల వినియోగంపై హైదరాబాద్‌ ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉంది.- గవర్నర్‌ తమిళిసై

  • 15 Mar 2021 12:23 PM (IST)

    ఈ-ట్రాన్సాక్షన్‌లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానం

    ఇతర రాష్ట్రాలో పోలిస్తే అనేక అద్భతమైన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని, సులభతర వాణిజ్యం విధానంలో టాప్‌ 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఈ-ట్రాన్సాక్షన్‌లో దేశంలోనే మనది రెండో స్థానం ఉంది. ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాము. – గవర్నర్‌

  • 15 Mar 2021 12:16 PM (IST)

    మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించాం

    రాష్ట్రంలో రిజర్వాయర్ల సామర్థ్యం 342.21 టీఎంసీలు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తున్నాము. మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించాము. 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించాము. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి. పంటల విస్తీర్ణం కూడా పెరిగింది. రైతు బంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నాము.- గవర్నర్‌

  • 15 Mar 2021 12:12 PM (IST)

    భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు అమోదం రావడం గర్వకారణం

    భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం రావడం గర్వకారణం. ఫార్మా రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే ఫార్మా సిటీ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి కరోనా టీకా అందించాం. వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది- గవర్నర్‌

  • 15 Mar 2021 12:09 PM (IST)

    మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాము

    మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాము. అన్ని మతలాలకు సమాన ఆదరణ, న్యాయం లభిస్తోంది. ఔషధ నగరిగా హైదరాబాద్‌కు ఖ్యాతి లభించింది. గ్రేటర్‌ నుంచే ఎన్నో టీకాలు, మందులను ఉత్పత్తి జరుగుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది. - గవర్నర్‌

  • 15 Mar 2021 12:06 PM (IST)

    టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 15,252 పరిశ్రమలకు అనుమతి

    టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 15,252 పరిశ్రమలకు అనుమతి ఇచ్చాము. రూ.2.13 లక్షల కోట్లు పెట్టుబడులు, 15.51 లక్షల ఉద్యోగాలు. సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తోంది. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:57 AM (IST)

    హైదరాబాద్‌కు మరో మణిహారం రీజనల్‌ రింగ్‌ రోడ్‌

    తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గర్నర్‌ ప్రసంగం కొనసాగుతోంది. 95 శాతం భూముల హక్కులపై సృష్టిత. 60 లక్షల మంది రైతుల ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. హైదరాబాద్‌కు మరో మణిహారం రీజనల్‌ రింగ్‌ రోడ్‌. ఓఆర్‌ఆర్‌కు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల పొడవు ఔంటర్‌ రింగ్‌ రోడ్డు. -గవర్నర్‌

  • 15 Mar 2021 11:54 AM (IST)

    ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు

    కొత్త మున్సిపల్‌ , రెవెన్యూ చట్టంతో పాలనలో సమూలమైన మార్పులు జరగనున్నాయి. ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాము. గతంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టబడి ఉంది. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాము. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:50 AM (IST)

    త్వరలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి

    త్వరలోనే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కానుంది. డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తున్నాము. రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేల రూపాయలు అందజేస్తున్నాము. 2.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాము. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్ర ముందుకు వెళ్తోంది. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:46 AM (IST)

    ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానం

    ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో ఉంది. 67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అలాగే విద్యుత్‌ రంగంలో ఎన్నో విజయాలను సాధించాము. అతి తక్కువ సమయంలోనే సమస్యల నుంచి గట్టెక్కాము. రైతులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:41 AM (IST)

    తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథ శాశ్వత పరిష్కారం

    తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం లభించింది. దేశానికే ఈ కార్యక్రమం ఎంతో ఆదర్శంగా నిలిచింది. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెడుతున్నాము. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:39 AM (IST)

    అన్ని వర్గాల ప్రజలకు పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

    అన్ని వర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచాము. ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించాం. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:36 AM (IST)

    ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానం

    ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిస్థానంలో ఉందన్నారు గవర్నర్‌ తమిళి సై. 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అలాగే విద్యుత్‌ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాము. అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం.

  • 15 Mar 2021 11:34 AM (IST)

    అభివృద్ధి విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది

    తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు అందించాము. పెన్షన్‌ కోసం ప్రతి ఏటా 8,710 కోట్ల రూపాయలను కేటాయింపు. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర అగ్రగామిగా ఉంది. ఎన్నో ఇబ్బందుల నుంచి తొలదొక్కకున్నాము.- గవర్నర్‌

  • 15 Mar 2021 11:32 AM (IST)

    గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు అందిస్తున్నాం

    గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు అందిస్తున్నాం. 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు అందించాము. మిషన్‌ కాకతీయ భూగర్భ జలాలు పెరిగాయి. పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. - గవర్నర్‌

  • 15 Mar 2021 11:25 AM (IST)

    24 గంటల పాటు విద్యుత్‌ అందించే తొలి రాష్ట్రంగా రికార్డ్

    మిషన్‌ భగీరథ ద్వారా మారుమూల తండాలకూ తాగునీరు ఇచ్చాము. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్‌ రంగంలో రాష్ట్ర అద్వితీయ విజయాలు సాధించింది. 24 గంటల పాటు విద్యుత్‌ను అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించాము. ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్నాము - గవర్నర్‌ తమిళసై

  • 15 Mar 2021 11:22 AM (IST)

    తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది

    తెలంగాణ రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళసై అన్నారు. జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ అని, విద్యుత్‌ సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రసంసించిందన్నారు.

  • 15 Mar 2021 11:16 AM (IST)

    ఆర్థిక నిర్వహణలో క్రమ శిక్షణ పాటిస్తున్నాం- గవర్నర్

    ఆర్థిక నిర్వహణలో క్రమ శిక్షణ పాటిస్తున్నాం. ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28వేలకు పెరిగింది. ఆర్థిక నిర్వహణలో క్రమ శిక్షణ పాటిస్తున్నాం. కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బందులు కూరుకుపోయాయి - గవర్నర్‌

  • 15 Mar 2021 11:13 AM (IST)

    ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాన ఏర్పడింది

    ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అపోహాలు సృష్టించారని గరవ్నర్‌ అన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచాము. ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని అన్నారు.

  • 15 Mar 2021 11:11 AM (IST)

    కేసీఆర్‌ సారథ్యంలో వినూత్న పథకాలు- గవర్నర్‌

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలను రూపొంచారని గవర్నర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజల పురోగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

  • 15 Mar 2021 11:09 AM (IST)

    సమావేశంలో ఖరారు చేయనున్న బడ్జెట్‌ అజెండా

    బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం బడ్జెట్‌ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు.

  • 15 Mar 2021 11:06 AM (IST)

    అందరికి నమస్కారం.. అంటూ గవర్నర్‌ ప్రసంగం

    అందరికి నమస్కారం అంటూ గవర్నర్‌ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • 15 Mar 2021 11:04 AM (IST)

    గవర్నర్‌ ప్రసంగం

    బడ్జె్‌ట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సభనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు.

  • 15 Mar 2021 11:02 AM (IST)

    బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

    తెలంగాణ అసెంబ్లీ బడ్జె్‌ట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగించనున్నారు.

  • 15 Mar 2021 10:57 AM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

    తెలంగాణ బడ్జె్‌ట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు.

  • 15 Mar 2021 10:54 AM (IST)

    కాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగించనున్నారు.

Published On - Mar 15,2021 12:28 PM

Follow us
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!