Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది: గవర్నర్‌ తమిళిసై

Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ ..

  • Subhash Goud
  • Publish Date - 1:02 pm, Mon, 15 March 21
Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది: గవర్నర్‌ తమిళిసై

Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అపోహాలు సృష్టించారని అన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని, ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని అన్నారు. తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం లభించింది. దేశానికే ఈ కార్యక్రమం ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెడుతున్నాము అని గవర్నర్ అన్నారు.

ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానం:

కాగా, ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందని అన్నారు. 67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, విద్యుత్‌ రంగంలో ఎన్నో విజయాలను సాధించామని, అతి తక్కువ సమయంలోనే సమస్యల నుంచి గట్టెక్కి.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. అలాగే త్వరలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కానుందని, డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తున్నామని అన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేల రూపాయలు అందజేస్తున్నామని, 2.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నా్మన్నారు. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్ర ముందుకు వెళ్తోందని అన్నారు.

ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు :

అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను పునరుద్దరించిందని, దీని ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. కొత్త మున్సిపల్‌ , రెవెన్యూ చట్టంతో పాలనలో సమూలమైన మార్పులు జరగనున్నాయని చెప్పారు. అయితే గతంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన గవర్నర్ వెల్లడించారు.

మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాం..

అలాగే మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని, అన్ని మతలాలకు సమాన ఆదరణ, న్యాయం లభిస్తోందని అన్నారు. ఔషధ నగరిగా హైదరాబాద్‌కు ఖ్యాతి లభించిందని, గ్రేటర్‌ నుంచే ఎన్నో టీకాలు, మందులను ఉత్పత్తి జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని గవర్నర్‌ వివరించారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ఆమోదం రావడం గర్వకారణం. ఫార్మా రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే ఫార్మా సిటీ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి కరోనా టీకా అందించాం. వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి : అస్సాంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయం, ఎన్సీపీ నేత శరద్ పవార్ జోస్యం

Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో 11 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడించిన ఎన్నికల కమిషన్‌