AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో 11 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడించిన ఎన్నికల కమిషన్‌

AP Municipal Elections 2021:ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది. అన్ని స్థానాలను వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు...

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో 11 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడించిన ఎన్నికల కమిషన్‌
Ap Municipal Elections 2021
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2021 | 7:04 AM

AP Municipal Elections 2021:ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది. అన్ని స్థానాలను వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఎన్నికల కౌంటింగ్‌లో అధిక శాతం వైసీపీ కైవసం చేసుకోగా, కొన్ని స్థానాలో టీడీపీ సాధించుకుంది. ఇక అక్కడక్కడ జనసేన, ఇతరులు గెలుపొందారు. తాజాగా మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఫలితాలు ఎన్నికల కమిషనర్‌ ప్రకటించింది.

11 కార్పొరేషన్ల ఫలితాలు

వైసీపీ- 516 టీడీపీ -80 జనసేన – 07 బీజేపీ -01 సీపీఎం -02 సీపీఐ -01 ఇండిపెండెంట్స్ -16

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు :

వైసీపీ -1740 టీడీపీ – 278 జనసేన- 23 బీజేపీ -08 కాంగ్రెస్ -02 సీపీఐ -02 ఇండిపెండెంట్స్ – 68 కాగా, ఏలూరు కార్పొరేషన్ 47 డివిజన్ల కౌంటింగ్ చేపట్టలేదు. అలాగే తిరుపతి 7 వార్డు ఎన్నిక నిర్వహించలేదు. అద్దంకి లో 8 వార్డులో అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు.

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ సత్తా చాటుతోంది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పత్తా లేకుండా పోతున్నాయి. ఎటు చూసినా వైసీపీ అధిపత్యం కొనసాగిస్తోంది. ఇక విశాఖ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం కనబర్చింది.

కాగా, ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి గట్టిదెబ్బ తగిలింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ పార్టీ నేతలు మౌనందాల్చారు. టీడీపీ పార్టీ కార్యాలయాల్లో నిరాశ వాతావరణం నెలకొంది. పార్టీ సైతం నిరాశలో ఉండిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఇంతలా దూసుకుపోతుందని టీడీపీ నేతలు ఊహించలేదు. అధికార పక్షానికి కొంత పైచేయి ఉంటుందని అనుకున్నా.. మరీ ఇంతగా వెనుకబడి పోతామని అనుకోలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ, విజయవాడల్లో సైతం సానుకూల ఫలితాలు రాకపోవడం టీడీపీని మరింత నిరుత్సాహపర్చింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం, అమరావతి రాజధానిని తరలించడం వంటి అంశాలు ఈ రెండు నగరాల్లో ప్రభావం చూపిస్తుందని అనుకున్నా.. నిరుత్సాహ పర్చాయి. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత కాలంగా స్తబ్దుగా ఉండటం ఆయన నియోజకవర్గంలో నష్టపర్చింది. మిగిలిన నగరాలతో పోలిస్తే కొంత నయమే అయినా విశాఖ ఓటర్లపై మేం పెట్టుకున్న ఆశలు నెరవేరలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే విశాఖ 89 వార్డును కౌంటింగ్‌ సంబంధించి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఆ వార్డుకు సంబంధించి వైసీపీ అభ్యర్థి స్వల్ప తేడాతో గెలిచినట్లు ముందుగా ఎన్నికల అధికారులు ప్రకటించగానే టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అధికారులు తప్పుడు ప్రకటన చేశారని, తమ అభ్యర్థే గెలుపొందుతారని ఆందోళన దిగారు. మళ్లీ రీకౌంటింగ్‌ చేసే వరకు ఊరుకునేది లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అధికారులు రీకౌంటింగ్‌ చేపట్టారు. అనంతరం 73 ఓట్లతో టీడీపీ అభ్యర్థి రమేష్‌ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం జగన్‌.. ఈ చారిత్రక విజయానికి కారణం అదేనంటూ..

AP Municipal Election Results 2021: వైసీపీ ప్రభంజనంలో గ్లాస్‌ గల్లంతు.. కమలం కకావికలం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!