AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం జగన్.. ఈ చారిత్రక విజయానికి కారణం అదేనంటూ..
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ చేస్తూ సంచలన విజయం నమోదు చేసుకుంది. అన్ని జిల్లాల్లో..
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ చేస్తూ సంచలన విజయం నమోదు చేసుకుంది. అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగింది. ఫ్యాన్ వేగానికి ప్రతిపక్ష పార్టీలు నిలవలేకపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం కార్పొరేషన్ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు వైసీపీ హవా కొనసాగింది. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యర్థులకు ఒక్క వార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. సీఎం జగన్ కనీస ప్రచారం చేయకపోయినా వైసీపీ ఈ స్థాయిలో సాధించడం పట్ల అంతటా చర్చ జరుగుతోంది. ఇక ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. వైసీపీ విజయానికి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ భారీ విజయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ పార్టీని గెలిపించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2021