AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది

రోజు రోజుకు డ్రగ్స్‌ మాఫియా దొంగ తెలివితేటలు పెరిగిపోతున్నాయి. ఒక్కో ఎత్తుగడతో తమ వ్యాపారాన్ని సాగించేస్తున్నాయి. సాధారణ పంటల మధ్య డ్రగ్స్‌కు...

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
Opium Cultivation
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Mar 15, 2021 | 6:52 PM

Share

రోజు రోజుకు డ్రగ్స్‌ మాఫియా దొంగ తెలివితేటలు పెరిగిపోతున్నాయి. ఒక్కో ఎత్తుగడతో తమ వ్యాపారాన్ని సాగించేస్తున్నాయి. సాధారణ పంటల మధ్య డ్రగ్స్‌కు అవసరమైన రా మెటీరియల్ సాగు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి భారీ మాఫియా గుట్టును మదనపల్లె పోలీసులు రట్టు చేశారు.

ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులు అక్రమ మార్గాలు పడుతున్నారు. చివరకు కొందరు రైతులను వక్రమార్గం పట్టిస్తున్నారు. అలాంటి కేసు చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగు చూసింది. పోలీసులను పరుగులు పెట్టించింది. మదనపల్లెలో కూలీలతో డ్రగ్స్‌కు అవసరమైన పంట పండిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ భారీ డ్రగ్‌ మాఫియాను పోలీసులు ఛేదించి ఇద్దర్ని అరెస్టు చేశారు. కీలక వ్యక్తుల కోసం వేట సాగిస్తున్నారు. మదనల్లెలో టమాటో పంట సాగు పేరుతో కొందరు వ్యక్తులు… ఓపీఎంను పండిస్తున్నారు. దీన్ని మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్‌ కోసం ఉపయోగిస్తారు. ఈ పరిసరాలు చూస్తే టమాటో పంట సాగు కనిపిస్తుంది కానీ…లోపలికి వెళ్లి చూస్తే మత్తు పదార్థాలకు అవసరమైన రా మెటీరియల్ పండిస్తున్న తెలుస్తుంది. ఎన్నో రోజులుగా ఈ దందా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఎస్‌ఈబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ఓపీఎం కాయాలు ధ్వంసం చేశారు. అధికారులు వెళ్లే సరికి ఇద్దరు కూలీలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా ఎవరూ కనిపించలేదు. వాళ్లను అరెస్టు చేసిన ఆఫీసర్స్‌ పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్న అసలు నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కూలీలతో ఈ తప్పుడు పనులు చేయించి… వేరే వ్యక్యులు లాభపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు. డబ్బులకు ఆశపడి రైతులు ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌లో అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎక్కడైనా చూస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరుతున్నారు. అనుమానితులు కనిపిస్తే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. ఈ ఓపిఎంకు బయట దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. గుర్తు పట్టలేని ఇలాంటి ప్రాంతాల్లో పండించి సొమ్ము చేసుకుంటోంది డ్రగ్ మాఫియా.

Also Read:  కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్… పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి‌

బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని వస్తారు.. డబ్బు వసూలు చేసి ఉడాయిస్తారు.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!