కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్… పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి‌

మట్టితో ఆరోగ్యం... మట్టి పూసుకొని యోగా చేస్తే మరింత మేలు అంటున్నారు కొందరు యోగా గురువులు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో మడ్‌బాత్‌తో యోగాసనాలు

కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్... పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి‌
Mud Bath2
Follow us

|

Updated on: Mar 15, 2021 | 7:56 AM

మట్టితో ఆరోగ్యం… మట్టి పూసుకొని యోగా చేస్తే మరింత మేలు అంటున్నారు కొందరు యోగా గురువులు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో మడ్‌బాత్‌తో యోగాసనాలు వేసి అహగాహన కల్పించారు. మట్టిని ఒంటికి పూసుకుంటున్న వీళ్లంతా యోగా ప్రాక్టిస్నర్స్‌… ఇలా మట్టి పూసుకోవడం చాలా ఆరోగ్యకరమంటూ చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డి యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మడ్‌బాత్‌ ప్రోగ్రామ్ చేపట్టారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి చెరువు వద్ద అంతా గుంపుగా మడ్‌ బాత్ చేశారు. ముందుగా పుట్టమన్ను తీసుకొచ్చి.. దంచారు. తర్వాత దాన్ని జల్లెడ పట్టారు. అందులో నిమ్మకాయలు, గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడతోపాటు సుగంధ ద్రవ్యాలు వేసి కలిపారు. తర్వాత ఉదయం సూర్య కిరణాలు తగిలే ప్రదేశానికి వెళ్లి ఇలా మట్టిని ఒంటికి పూసుకున్నారు. బాడీ మొత్తానికి మట్టిని అప్లై చేసిన తర్వాత సరెండు గంటల పాటు యోగాసనాలు వేశారు.

బాడీపై ఉన్న మట్టి మొత్తం ఎండిపోయిన తర్వాత చెరువులో స్నానం చేశారు. ఫుడ్‌హాబిట్స్‌, వెదర్ కండీషన్ మారడం వల్ల చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని… అందుకే ఇలాంటి పురాతన వైద్యంతో మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు యోగా అసోసియేషన్ సభ్యులు. చర్మవ్యాధుల నివారణకు లక్షలు ఖర్చులు చేస్తున్నారని ఈ మడ్‌ బాత్‌ వల్ల చర్మవ్యాధులు చాలా వరకు దూరమైపోతాయని చెబుతున్నారు. కనీసం నెలలో ఒకటి రెండుసార్లు ఈ మడ్‌ బాత్‌తో మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

Also Read:

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే