AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని వస్తారు.. డబ్బు వసూలు చేసి ఉడాయిస్తారు.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త

బ్యాంకు రుణాలు పేరుతో మోసం... డబ్బులేవని నిలదీస్తే బెదిరింపులు... కేసులు పెడతామంటే ఆత్మహత్యా యత్నం... కామారెడ్డిలో జరిగిన ఈ సంఘటన సంచలనమవుతోంది.

బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని వస్తారు.. డబ్బు వసూలు చేసి ఉడాయిస్తారు.. ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్త
Cheating
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2021 | 8:13 AM

Share

బ్యాంకు రుణాలు పేరుతో మోసం… డబ్బులేవని నిలదీస్తే బెదిరింపులు… కేసులు పెడతామంటే ఆత్మహత్యా యత్నం… కామారెడ్డిలో జరిగిన ఈ సంఘటన సంచలనమవుతోంది. తమ డబ్బులు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  గృహ రుణాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి భాగోతం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. లింగంపేటకు చెందిన మన్నే రాజు… ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగినంటూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఇంటి రుణాలు ఇప్పిస్తానని బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రేగుల సంతోష్ సహా మరో నలుగురి వద్ద కమీషన్లు కొట్టేశాడు. మొత్తం లక్షా 11వేల రూపాయల నగదు… ఇంటి కాగితాలు తీసుకొని ఉడాయించాడు. రోజులు గడుస్తున్నా రుణం ఇవ్వకపోగా తప్పంచుకొని తిరిగాడు. గట్టిగా నిలదీస్తే డెడ్‌లైన్లు పెడుతూ వచ్చాడు. ఓ రోజు రాజు ఇంటికి వెళ్లిన బాధితులు… జరిగిన మోసాన్ని ఆయన భార్యకు చెబితే ఆమె రెండు మూడు రోజులు అంటూ దాటవేశారు. మళ్లీ వెళ్తే కొద్ది రోజుల్లో అమౌంట్ సెట్ చేస్తానని మాట ఇచ్చి… 100 రూపాయల స్టాంప్‌ పేపర్‌పై రాసిచ్చారు. తర్వాత ఆ స్టాంప్ పేపర్‌ తీసుకెళ్లి డబ్బులు ఏవని నిలదీస్తే… తమకు ఎలాంటి సంబంధం లేదని… అసలు డబ్బులే తీసుకోలేదని బుకాయించారు. ఏం చేసుకుంటారో చేసుకోండని చీత్కరించుకున్నారు. గట్టిగా అడిగితే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఏం చేయాలో తెలియక కామారెడ్డి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కంప్లైంట్‌ సంగతి తెలుసుకొని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు రాజు భార్య. వెంటనే ఆమెను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స చేయించారు స్థానికులు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని తేల్చారు వైద్యులు. రావాల్సిన డబ్బులు అడిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. బ్యాంక్‌ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని… తమ అమౌంట్‌ తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకొని బెదిరింపులకు దిగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

Also Read: కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్… పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి‌

Also Read: ‘బుట్టబొమ్మ’ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగదరియా’..

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే