‘బుట్టబొమ్మ’ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగదరియా’..

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమ కావ్యం 'లవ్ స్టోరీ'. ఇందులో చైతన్యకు జోడీగా ఫిదా బ్యూటీ

'బుట్టబొమ్మ'ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న 'సారంగదరియా'..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Mar 15, 2021 | 7:01 PM

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరీ’. ఇందులో చైతన్యకు జోడీగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమూవీ విడుదలకు ముందే సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఒక్కో పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రెండువారాల కిందట విడుదలైన ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొదటి తెలుగు పాటగా సారంగదరియా నిలిచింది.

అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సారంగదరియా సాంగ్ 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సాంగ్ కంటే ముందు తమిళ స్టార్ హీరో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన రౌడీ బేబి సాంగ్ కేవలం 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్.. అల… వైకుంఠపురం సినిమాలోని బుట్టబోమ్మ, రాములో రాములా సాంగ్స్.. సారంగదరియా తర్వాత నిలిచాయి. బుట్ట బోమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడానికి 18 రోజులు పట్టగా… రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. ఈ లెక్కన చూస్తే.. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది సారంగదరియా. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ అందమైన ప్రేమ కథ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది

భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?